రెంజల్(నిజామాబాద్): రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో గురువారం ఉదయం (నిర్బంధ తనిఖీ) కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. బోధన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోటగిరి, బోధన్, ఎడపల్లి, రెంజల్ ఎస్సైలతో పాటు పలువురు ప్రత్యేక సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎలాంటి లెసైన్స్‌లు లేని 12 బైక్‌లను, ఓ ట్రాక్టర్‌ను ఇప్పటి వరకూ సీజ్ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.