పర్సు దొంగ అరెస్ట్
Published Mon, Nov 14 2016 2:09 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో కొంతకాలంగా పర్సు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ బాలికను (15) అరెస్టు చేసి రూ.7 లక్షల విలువైన 30 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట బీసీ కాలనీకి చెందిన బాలిక కొంతకాలంగా ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళల పర్సుల దొంగతనాలకు పాల్పడుతోంది. గతంలో బాలిక ఏలూరు సంతలో పర్సు దొంగతనాలకు పాల్పడి పోలీసులకు పట్టుబడి జువైనల్ హోమ్‌కు తరలించారు. హోమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాలిక చోరీలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో పట్టణానికి చెందిన షేక్ సమీలా, పోతవరానికి చెందిన నున్న లక్ష్మి, దమ్మపేట మండలం నారావారిగూడానికి చెందిన తెల్లమేకల లక్షి్మకి చెందిన పర్సులను దొంగిలించింది. పర్సుల్లోని బంగారాన్ని జంగారెడ్డిగూడెంలో విక్రయించేందుకు స్థానిక మునిసబుగారి వీధిలో సంచరిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక నుంచి 30 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ జి.శ్రీనివాసయాదవ్, ఎస్‌సై ఎం.కేశవరావు, ఐడీ పార్టీ హెడ్‌కానిస్టేబుళ్లు ఎ¯ŒSవీ సంపత్‌కుమార్, ఎ¯ŒS.రాజేంద్రప్రసాద్, కానిస్టేబుళ్లు రాజశేఖర్, కిరణ్‌కుమార్, మహిళా కానిస్టేబుళ్లు సునీతను అభినందించారు. వీరికి రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేస్తామని చెప్పారు.
Advertisement