టన్నుకుపైగా గంజాయి స్వాధీనం
టన్నుకుపైగా గంజాయి స్వాధీనం
Published Thu, Jun 15 2017 1:23 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM
దేవరపల్లి: జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.కోటి పైనే ఉం టుందని అంచనా. విశాఖ జిల్లాలోని అటవీ గ్రామాల నుంచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల మీదుగా హైదరాబాద్‌కు పెద్దఎత్తున గంజాయి అక్రమ రవాణా అవుతోంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు దేవరపల్లి వద్ద విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఐషర్ వ్యాన్‌ను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కూరగాయల ప్లాస్టిక్ ట్రేల మధ్యన 32 బస్తాల గంజాయి మూటలను గుర్తించారు. వ్యాన్‌లో ఉన్న విశాఖకు చెందిన పిల్లా శ్రీను, అనకాపల్లి సమీపంలోని శకరం గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్లు చెరగడం సాయి, రోలుగుంటకు చెందిన మరో డ్రైవర్ కోనాల నూకరాజును అరెస్ట్ చేశారు. సాయంత్రం పోలీస్‌స్టేషన్ వద్ద జంగారెడ్డిగూడెం డీఎస్పీ వి. వెంకట్రావు వివరాలు వెల్లడించారు. విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం నుంచి ఐషర్ వ్యాన్‌లో 32 బస్తాల్లో సుమారు 308 గంజాయి ప్యాకెట్లు హైదరాబాద్‌కు రవాణా అవుతున్నట్టు సమాచారం అందిందన్నారు. దేవరపల్లి వద్ద ఎస్సై పి.వాసు వ్యాన్‌ను పరి శీలించగా సుమారు 800 కిలోల గం జాయి ఉందన్నారు. వ్యాన్‌లో ఉన్న పిల్లా శ్రీను. శరగడం సాయి, కోనాల నూకరాజును అరెస్ట్ చేశామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.80 లక్షల వరకు ఉంటుందని చె ప్పారు. గంజాయి రవాణాకు ప్రధాన సూత్రధారి అనకాపలి్లకి చెందిన శివ అని, ఆయన పేరునే వ్యాన్ ఉందన్నారు. శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కొ వ్వూరు సీఐ శరత్‌రాజ్‌కుమార్, ఎస్సై పి.వాసు, సిబ్బందిని ఆయన అభినందించారు.
లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
జగన్నాథపురం (గోపాలపురం) : గంజాయిని కారులో తరలిస్తుండగా లారీని ఢీకొట్టడంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన గోపాలపురం మండలం జగన్నాథపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు ఏపీ 37 ఏపీ 666 నంబర్ కారులో సుమారు 200 కిలోల గంజాయిను రవాణా చేస్తున్నారు. ఈ కారు గోపాలపురం మండలం జగన్నాథపురం వచ్చేసరికి జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ మృతిచెందాడు. కారులో రెండు కిలోల చొప్పున 94 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని తహసీల్దార్ ఎన్.నరసింహమూర్తి తెలిపారు. వీటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎస్సై యు.లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ రాజమండ్రి సీటీఆర్‌ఐ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్వరరావుగా భావిస్తున్నారు. కారులో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి ఉన్నాడు. అతడి కాళ్లు, తలకు బలమైన గాయాలు కావడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న వివిధ నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement