వైన్‌షాపు నుంచి మద్యం బాటిల్స్ కొనుగోలు చేసి ఇంటి వద్ద విక్రయిస్తున్న ఓ యువకుడిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
వైన్‌షాపు నుంచి మద్యం బాటిల్స్ కొనుగోలు చేసి ఇంటి వద్ద విక్రయిస్తున్న ఓ యువకుడిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..బోడుప్పల్ ఆనంద్‌నగర్‌లో నివసించే అప్పగోని రమేష్(30) స్థానిక వైన్‌షాపుల నుంచి మద్యం బాటిల్స్ కొనుగోలు చేసి ఇంటి వద్ద విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో స్థానికుల సమాచారం మేరకు ఆదివారం మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో మేడిపల్లి పోలీసులు దాడి చేసి 96 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.