హత్యకేసులో నిందితుల అరెస్ట్ | The arrest of the accused in murder case | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితుల అరెస్ట్

Published Tue, Aug 2 2016 7:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

The arrest of the accused in murder case

 మద్యం మత్తులో ప్రాణ స్నేహితుడిని బీరుసీసాతో పొడిచి చంపిన ఘటనలో నిందితులు బిజ్జు రమేష్(33), ఆవుల చంద్రశేఖర్ అలియాస్ చందు(29)లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 28వ తేదీన రహ్మత్‌నగర్ చేపల మార్కెట్ సమీపంలో నివసించే కలికుడ సంధ్యారాజ్(28)ని మద్యం తాగుదామని చందు తన నివాసానికి తీసుకెళ్లాడు.

 

అదే రోజు రాత్రి మరోస్నేహితుడు రమేష్, చందు, సంద్యారాజ్ మద్యం సేవిస్తుండగా రమేష్‌కు, సంధ్యారాజ్‌కు చిన్న విషయంలో గొడవ జరిగింది. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియకుండా రమేష్ బీరుసీసాను పగలగొట్టి సంధ్యారాజ్ తలపై బలంగా పొడిచాడు. చేతులపై కూడా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం జరగడంతో సంధ్యారాజ్ మృతి చెందాడు. ఈ ఘటనలో తప్పించుకు తిరుగుతున్న రమేష్, చందులను పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement