వైఎస్సార్‌సీపీకి మద్య నియంత్రణ కమిటీ వినతి
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం బెల్ట్‌షాపులను రద్దు చేస్తామనే హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని రాష్ట్ర మద్య నియంత్రణ కమిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసింది. కమిటీ రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణ్‌రెడ్డి, అప్సా డెరైక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి, ఎం.వి.ఫౌండేషన్ కోఆర్డినేటర్ డి.యాదయ్యలతో కూడిన ప్రతినిధి బృందం ఆదివారం వైఎస్సార్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులతో సమావేశమై ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించింది.
అనంతరం లక్ష్మణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం తీసుకొస్తే.. తరువాత వచ్చిన ప్రభుత్వాలు దానిని నీరుగార్చాయన్నారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా మద్యంపై నియంత్రణ ఉండాలని కోరామన్నారు. బెల్ట్‌షాపులను నిర్మూలిస్తామని, ప్రతిగ్రామానికీ పది మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించి మద్యం అమ్మకాల్లేకుండా చేస్తామని మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి తమకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
బెల్ట్ షాపులను రద్దు చేయాలి
Published Mon, Mar 31 2014 12:44 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement