likker
-
ఎన్నికల హోరు లిక్కర్ జోరు
మంచిర్యాలక్రైం: జిల్లాలో నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్డీపీ) లిక్కర్ విక్రయాలకు చెక్ పెట్టేందుకు ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. ఈ లిక్కర్‌తో సర్కారు ఖజానాకు భారీగా గండిపడే అవకాశం ఉండడంతో అక్రమ దందాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాలోని దాదాపు అన్ని మద్యం షాపులు ఇప్పటికే ఏడు రెట్లు అధికంగా మద్యం విక్రయించాయి. అదనంగా విక్రయించే మద్యంపై చెల్లించే మార్జిన్‌ను ప్రభుత్వం గతంలో తగ్గించిం ది. ఏడు రెట్ల వరకు 15శాతం ఇచ్చే మార్జిన్‌ను ఆ తర్వాత ఐదు శాతానికి పరిమితం చేసింది. దీంతో అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు మద్యం వ్యాపారులు ఎన్డీపీ మద్యాన్ని విక్రయించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే జిల్లాలో వాడవాడల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేయించి, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలకు తెరలేపడం తెలిసిందే. ఇప్పుడు ఎన్డీపీ లిక్కర్ అమ్మకాల కోసం అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కన్నేసి ఉంచింది. గతంలో పట్టుబడిన ఎన్డీపీ లిక్కర్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్డీపీ మద్యం విక్రయాలు జరుగుతున్న ఘటనలు ఉన్నాయి. గతంలో నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాల్లో ఎన్డీపీ మద్యాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు గుర్తించారు. బోధన్, ఆర్మూర్, ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో భారీ గానే ఎన్డీపీ మద్యం పట్టుబడిన దాఖాలాలు ఉన్నాయి. ఇటీవల నిర్మల్ జిల్లా కేంద్రంగా సరఫరా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని బడా మద్యం వ్యాపారులకు నిర్మల్‌కు చెందిన ఎన్డీపీ మద్యం సరఫరా చేసే ముఠాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఎౖMð్సజ్ శాఖ అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. దీనికితోడు ఎన్నికలు దగ్గర పడుతుండడం తదితర కారణాలతో జిల్లాలోకి ఈ నిల్వలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ శాఖ భావిస్తోంది. భారీగా అక్రమార్జన.. పాండిచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాలు, గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో మద్యంపై ప్రభుత్వం విధించే పన్నులు నామమాత్రంగా ఉంటాయి. రాష్ట్రంలో రూ.1000 విలువ చేసే మద్యం సీసా అక్కడ రూ.4వందలోపే ఉంటుంది. రాష్ట్రంలోని ధరల కంటే సగానికిపైగా తక్కువకు మద్యం లభిస్తుంది.దీంతో అక్కడినుంచి పెద్ద మొత్తంలో ఈ ఎన్డీపీ మద్యం నిల్వలను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయారాష్ట్రాల పరిధిలోని చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాల కళ్లుగప్పి రాష్ట్రంలో డంప్ చేసే ముఠాలున్నాయి. నిర్మల్ ప్రాంతానికి చెందిన బడా మద్యం వ్యాపారులకు ఈ ముఠాలతో సంబంధాలున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమానిస్తున్నారు. ఎన్నికల్లో పెద్దమొత్తంలో మద్యం ఏరులై పారుతోంది. దీంతో ఇప్పటినుంచే మద్యం నిల్వలపై నేతలు దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీపీ లిక్కర్ జిల్లాకు చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మాదిరిగానే ఈసారి కూడా ఎన్డీపీ మద్యం దిగుమతి అయ్యే ఆస్కారం ఉంటుందని, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నిఘా పటిష్టం చేశామని ఎక్సైజ్ శాఖలోని ఓ ఉన్నతాధికారి చెప్పడం గమనార్హం. -
భర్త వేధింపులకు బలి
– మహిళ ఆత్మహత్య – చాగలమర్రిలో ఘటన చాగలమర్రి: మద్యం మత్తులో నిత్యం భర్త పెట్టే వేధింపులను భరించలేని ఓ మహిళ చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. తన చిన్నారి కొడుకుకు అమ్మ ప్రేమను దూరం చేసింది. ఈ ఘటన చాగలమర్రి గుంతపాలెం కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామంలోని బుగ్గరస్తా కాలనీకి చెందిన చాంద్‌బాషా తొమ్మిదేళ్ల క్రితం గుంతపాలెం కాలనీకి చెందిన ఖైరూన్బీని వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడున్నాడు. సిమెంటు పని చేస్తూ జీవనం సాగిస్తున్న చాంద్‌బాషా రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. జులాయిగా తీరుగుతూ మద్యం మత్తులో భార్యను వేధింపులకు గురిచేసేవాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. మాటామాట పెరిగి భార్యను చితకబాదాడు. దీంతో ఆమె భరించలేక అర్ధరాత్రి సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లారిన తర్వాత ఇరుగుపొరుగు వారు గమనించి భర్త చాంద్‌బాషాను చితకబాదారు. ఎస్ఐ మోహన్‌రెడ్డి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన కూతురు మతికి ఆమె భర్తే కారణమని షరీఫా పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. -
మద్యం.. కల్తీ దందా..!
కాగజ్‌నగర్‌లో పడగ విప్పుతున్న మాఫియా మద్యంప్రియుల జీవితాలతో చెలగాటం మహారాష్ట్రకు తరలుతున్న కల్తీసరుకు చోద్యం చూస్తున్న అధికారులు కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ ప్రాంతంలో మద్యం మాఫియా కోరలు చాస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మందుబాబుల జీవితాలతో చెలగాటమాడుతోంది. కాగజ్‌నగర్ ప్రాంతం మహారాష్ట్రకు సరిహద్దులో ఉండడం, ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న చంద్రపూర్ జిల్లాలో మద్యపాన నిషేధం అమలులో ఉండడం కొందరు మద్యం అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. గత నెల 25న కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ వెనుక భాగంలో ఓ పాడుబడిన ఇంట్లో కల్తీ మద్యం తయారు చేసే కుటీర పరిశ్రమను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన మద్యం కల్తీ చేస్తూ నకిలీ సీళ్లు బిగిస్తూ ఇటు సిర్పూర్ నియోజకవర్గంలో అటు మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటుండగా, అధికారులు ఆలస్యంగా పట్టుకున్నారు. గత కొంతకాలంగా పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొందరు మద్యం వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయించడమే కాకుండా లూజ్ విక్రయాలు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఫిర్యాదులున్నాయి. ఇటీవల పట్టణంలోని రాజ్‌కుమార్ లాడ్జి సమీపంలోని మద్యం దుకాణంలో అధిక ధరకు బీర్లు విక్రయించగా.. కొనుగోలుదారుడు ప్రశ్నించినందుకు అతడిని షాపు నిర్వాహకులు చితక్కకొట్టారని ఫిర్యాదులు అందాయి. బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో కల్తీ చేయడమే కాకుండా కొందరు స్పిరిట్ కలుపుతూ మద్యంప్రియుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. అయినప్పటీకి ఎకై ్సజ్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. కల్తీదందా వ్యాపారులు కొందరు ఎక్సైజ్ అధికారులతో కుమ్ముకై దందా సాగిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. గత మే, జూన్, జూలైలో ఎక్సైజ్ అధికారులు నాలుగు వైన్స్‌షాపులు సీజ్ చేశారు. నకిలీ మూతలు బిగించి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. మద్యం కల్తీ దందా ఏ మేరకు సాగుతుందో దీన్ని బట్టే తెలుస్తోంది. రాయల్ స్టాగ్, మెక్డావల్, ఆఫీసర్స్ ఛాయిస్, ఎంపెరియల్ బ్లూ వంటి బ్రాండెడ్ కంపెనీలకు చెందిన నకిలీ మూతలను హైదారాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు తీసుకువచ్చి స్పిరిట్ కలిపిన కల్తీ మద్యం సీసాలపై బిగించి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. స్పిరిట్ కలిపిన మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. కాలేయ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. గత ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు కాగజ్‌నగర్‌కు చెందిన ఆరుగురు మద్యంప్రియుల కాలేయం పూర్తిగా దెబ్బతిని మృత్యువాతపడ్డారు. మద్యం సేవించడం వల్లే మరణించారని వైద్యులూ ప్రకటించారు. నియోజకవర్గంలోని సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, దహెగాం, కాగజ్‌నగర్ పట్టణంతోపాటు మండలంలో లైసెన్సు మద్యంషాపులు నిర్వహిస్తున్నారు. లైసెన్స్‌దారుల నుంచి కొందరు అక్రమార్కులు అధిక ధరలకు దుకాణాలు లీజుకు తీసుకుని ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ, నకిలీ దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి కల్తీ దందా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కల్తీ మద్యంపై కాగజ్‌నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మంగమ్మను సంప్రదించగా.. కల్తీకి పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై కూడా జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రకు కల్తీ మద్యం రవాణా చేసే గుట్టును రట్టు చేసినట్లు తెలిపారు. కల్తీ, నకిలీలకు పాల్పడే వారిపై ప్రజలు తమకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
ఆదిలాబాద్: తాగుడుకు బానిసైన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని ఎలగడప గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాదలేని చిన్నయ్య(30) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు. మద్యానికి బానిసైన చిన్నయ్య గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేరనే కారణంతో భార్యను వేధిస్తుండేవాడని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. (కడెం) -
బెల్ట్ షాపులను రద్దు చేయాలి
వైఎస్సార్సీపీకి మద్య నియంత్రణ కమిటీ వినతి హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం బెల్ట్‌షాపులను రద్దు చేస్తామనే హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని రాష్ట్ర మద్య నియంత్రణ కమిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసింది. కమిటీ రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణ్‌రెడ్డి, అప్సా డెరైక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి, ఎం.వి.ఫౌండేషన్ కోఆర్డినేటర్ డి.యాదయ్యలతో కూడిన ప్రతినిధి బృందం ఆదివారం వైఎస్సార్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులతో సమావేశమై ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించింది. అనంతరం లక్ష్మణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం తీసుకొస్తే.. తరువాత వచ్చిన ప్రభుత్వాలు దానిని నీరుగార్చాయన్నారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా మద్యంపై నియంత్రణ ఉండాలని కోరామన్నారు. బెల్ట్‌షాపులను నిర్మూలిస్తామని, ప్రతిగ్రామానికీ పది మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించి మద్యం అమ్మకాల్లేకుండా చేస్తామని మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి తమకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. -
అక్కడ... చుట్టలు.. మద్యమే నైవేద్యం
భగవంతునికి సమర్పించే కానుక ఎంత గొప్పది అన్నది కాదు ముఖ్యం, ఎంత భక్తితో సమర్పిస్తున్నా మన్నదే ముఖ్యం. అలా భక్తితో అర్పించే వాటి వరుసలో మద్యం, చుట్టలను కూడా చేర్చారు చెన్నైలోని ‘బాడీగార్డ్ మునీశ్వరు’ని భక్తులు. ఈ మునీశ్వరుని విగ్రహానికి మద్యంతో అభిషేకం చేసి, చుట్టలు నైవేద్యం పెట్టడం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోపాటూ వాహన సౌకర్యాలతో తమ కుటుంబాలు వర్ధిల్లగలవని విశ్వాసం. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుండి అన్నాశాలైకు వెళ్లే మార్గంలో బ్రిడ్జి దిగగానే కిలోమీటరు దూరంలో ఉంది ఈ ‘బాడీగార్డ్ మునీశ్వరాలయం’. చెన్నై సిటీ బస్సు సర్వీసు ‘పల్లవన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్’ బస్సు బాడీల నిర్మాణం డిపో ఇక్కడే ఉంది. ఈ డిపో పక్కనే ఆలయాన్ని నిర్మించడంతో ‘బాడీగార్డ్ మునీశ్వర్’ అనే పేరు వచ్చిందంటారు స్థానికులు. ఇక్కడ కొలువై ఉన్న ఈ బాడీగార్డ్ మునీశ్వర్ యాభై ఏళ్ళుగా భక్తుల పూజలందుకుంటున్నాడు ప్రమాదం తప్పాలన్నా... పిల్లలు పుట్టాలన్నా... తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటారు, మరో దేవుని ప్రసన్నం చేసుకునేందుకు కొబ్బరికాయలు కొడతారు. మునీశ్వర్ వద్ద మాత్రం ‘మా కోర్కెలు నెరవేర్చు స్వామీ! నీకు ఫుల్‌బాటిల్, కట్ట చుట్టలు సమర్పించుకుంటాను’ అని మొక్కుతారు. రోడ్డు మీద ప్ల్లాట్ఫామ్పై ఉన్న మునీశ్వరాలయానికి విశేషదినాల్లో బడాబాబుల నుండి సాధారణ ప్రజానీకం వరకు క్యూ కడతారు. సైకిల్ అయినా బెంజ్ కారైనా సరే మద్యం, చుట్టల సమర్పణతో ఇక్కడ పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందని అపారమైన నమ్మకం. 1919లో ఆర్కాడు జిల్లా నుండి కొందరు కార్మికులు మునీశ్వరుని విగ్రహాన్ని చెన్నైకి తీసుకువచ్చి ప్రస్తుతం గుడి సమీపంలో ప్రతిష్ఠించారు. అయితే బ్రిటిష్ సైనికాధికారి గుడి నిర్మాణంపై నిషేధాజ్ఞలు విధించారు. అదే రోజు ఆ అధికారి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ అధికారి వెంటనే నిషేధాజ్ఞలు ఉపసంహరించుకోగా భక్తులు గుడి నిర్మించుకున్నారు. దాంతో మునీశ్వర్ గుడిలో వాహన పూజలు చేయించుకుంటే ప్రమాదాలకు గురికాబోమనే విశ్వాసం వ్యాప్తి చెందింది. అయితే పూజకు మద్యం, చుట్టల కట్ట సమర్పించే ఆచారం ఎలా మొదలైందో తెలియదు. ఈ విషయాన్ని గుడినిర్వాహకులు, పూజారి కూడా చెప్పలేకపోతున్నారు. భక్తులు మద్యం, చుట్టలను మునీశ్వరునికి నైవేద్యం పెట్టించి గుడి ప్రాంగణంలోని హోమగుండంలో వేస్తారు. - కొట్రా నందగోపాల్ -
ఊరు ఊగేటు
ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో గ్రామాలలో మద్యం డంపులు పేరుకుపోతున్నాయి. ఐఎంఎల్ డిపో నుంచి లెసైన్స్ దుకాణాలకు తరలించే మద్యం నుంచి కొంత నేరుగా వ్యాపారులు బెల్ట్‌షాపులకు చేర్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్త ఆబ్కారీ విధానమొచ్చినా వ్యాపారులు మాత్రం సిండికేటు వీడలేదు. పాత పద్ధతిలోనే అధికారులకు మామూళ్లు చేరడం, నియంత్రణ లేనందున ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. పభుత్వం కొత్త ఆబ్కారీ విధానానికి శ్రీకా రం చుట్టినా, ఎన్నికల నేపథ్యంలో మద్యం వ్యాపారం మాత్రం పాత పద్ధతిలోనే సాగుతోంది. మద్యం దుకాణాల యజమానులు నిబంధనలను తుంగలో తొక్కి, రూటుమార్చి వ్యాపారం చేస్తున్నారు. మద్యం దుకాణాల ముందు గరిష్ట చిల్లర ధరల (ఎంఆర్పీ) పట్టికలను ప్రదర్శిస్తూ, లెసైన్స్ దుకాణాలకు తరలించే మద్యంలో కొంత నేరుగా డిపోల నుంచి బెల్టుషాపులకు తరలించి 20 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బెల్టుషా పులు మూసివేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. నాటుసారా విక్రయాలపైనా అబ్కారీ శాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. యథా సిండికేట్, తథా అబ్కారీ మద్యం విక్రయాలపై ప్రభుత్వ విధానం మారింది. క్షేత్రస్థాయిలో మాత్రం ‘వ్యాపారం’ తీరు మారలేదు. వ్యాపారులు సిండికేట్ వీడలేదు. మామూళ్లు ఆగడం లేదు. ఏసీబీ దాడుల నేపథ్యంలో ‘మా ఖర్చులు మాకుంటాయి కదా, చూడండి’ అంటూ సున్నితంగా మొదలైన ఎక్సైజ్, పోలీసుల మామూళ్ల దందా మళ్లీ బెదిరింపుల స్థాయి కి చేరింది. దీంతో సిండికేట్ వ్యాపారులు అడుగడుగునా బెల్టుషాపులను నిర్వహిస్తూ ‘గరిష్ట చిల్లర ధర’కు వక్రభాష్యం చెప్తున్నారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల సరి హద్దులో బెల్టుషాపులు, నాటుసారా, దేశీదారు యథేచ్ఛగా సాగుతున్నాయి. కామారెడ్డి, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బోధన్, మద్నూరు, జుక్కల్, నిజాంసాగర్, బిచ్కుంద, భీం గల్, సిరికొండ, కమ్మర్పల్లి, వర్ని, గాంధారితో పాటు పలు మండలాల్లో బెల్టుషాపులను నియంత్రించడంలో ఎక్సైజ్‌శాఖ పూర్తిగా విఫలమైందంటున్నారు. సగటున 20-25 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. గతంలో ఇలాగే జరిగితే, ఏసీబీ దాడులలో ఈ బండారం బయటపడింది. పలువురు పోలీసు, ఎక్సైజ్ అధికారులపై ఇప్ప టికీ కేసులున్నాయి. ఇంత జరిగినా కానీ మద్యం అక్రమాలలో అధికారులు నిమ్మకుండటం చర్చనీయాంశం అవుతోంది. బెల్టుషాపులపై ఎందుకీ ఉదాసీనత నిజామాబాద్, కామారెడ్డి ఈఎస్ కార్యాలయాల పరిధిలో పెద్దమొత్తంలో బెల్టుషాపులు ఉన్నట్లు అధికారుల లెక్కలే చెప్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఎల్లారెడ్డి, ఆర్మూరు, బాన్సువాడ తదితర ప్రాంతాలలో ఏళ్ల తరబడిగా యథేచ్ఛగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. కొత్త మద్యం వ్యాపారం 2012 జూలై 1 నుంచి అధికారికంగా ప్రారంభం కాగా జిల్లా వ్యాప్తంగా 142 మద్యం షాపుల కోసం టెండర్లు నిర్వహిస్తే 125 షాపులకు 1,538 దరఖాస్తులు వచ్చాయి. 17 దుకాణాలకు టెండర్లు దా ఖలు కాలేదు. 125 దుకాణాల్లో 24 దుకాణాలకు ఒక్కో షెడ్యూల్ రాగా, జూలై 26న నిర్వహించిన లక్కీ లాటరీలో 101 దుకాణాలకు టెండర్లు ఖరారు చేశారు. 2013 జూలైలో ఒప్పందం ప్రకారం మద్యం షాపులకు లెసైన్స్‌లు రెన్యూవల్ కాగా, బెల్టుషాపుల దందా మాత్రం అగలేదు. ఏప్రిల్ 2న సార్వత్రిక ఎన్నికల నోఫికేషన్ వెలువడనుండగా, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బెల్టుషాపులు, నాటుసారా, అక్రమ మద్యం ప్రవాహాలను అరికట్టేందుకు ఎన్నికల సంఘం సీరియస్‌గా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ బెల్టుషాపులు, నాటుసారా విక్రయాలను నియంత్రించడంలో అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అనైతిక కార్యకలాపాలను విడనాడాలి
ముదినేపల్లి రూరల్, : ప్రజలు అనైతిక కార్యకలాపాలను విడనాడి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సహకరించాలని ముదినేపల్లి ఎస్ఐ వి.సతీష్ కోరారు. మండలంలోని బొమ్మినంపాడు శివారు జానకిగూడెం, పాత, కొత్త దళితవాడలు, కొరగుంటపాలెం, శ్రీహరిపురం గ్రామాల్లో మంగళవారం జనమైత్రి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జూదాలు, మద్యపానం విడనాడితేనే సమాజంలో గౌరవప్రదమైన హోదా దక్కుతుందన్నారు. గ్రామాల్లో ఘర్షణలకు తావు లేకుండా స్థానికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిం చారు. ఆయా గ్రామాల సర్పంచులు నేతల రూప, అచ్యుత రాంబాబు, బడుగు జయమ్మ, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
శాలిపేటలో మద్య నిషేధం
చిన్నశంకరంపేట : గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించినా, తాగినా చర్యలు తప్పవని మండలంలోని శాలిపేట గ్రామస్తులు తీర్మానించారు. శనివారం రాత్రి గ్రామంలో సర్పంచ్ మూర్తి పెద్దులు, ఎస్ఐ ఉప్పు నాగయ్యల సమక్షంలో సమావేశమైన గ్రామస్తులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఇక ముందు ఎవరు మద్యం విక్రయించినా చర్యలు తప్పవని తీర్మానించారు. అంతేకాకుండా గ్రామస్థులెవరూ మద్యం తాగకూడదని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగయ్య మాట్లాడుతూ, గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. మండలంలో ఇప్పటికే 10 గ్రామ పంచాయతీల్లో మద్యం విక్రయాలు జరపకుండా ఆయా గ్రామాల వారు నిర్ణయం తీసుకున్నారన్నారు. మరి కొన్ని గ్రామాల్లో మద్యం విక్రయిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో, మద్యం విక్రయాలు నిలిచిపోయాయని తెలిపారు. మద్యం అమ్మితే రూ. 5 వేలు జరిమానా హత్నూర: మండల పరిధిలోని పన్యాల, బడంపేట గ్రామాల్లో మద్యం విక్రయించిన వారికి రూ. 5 వేల జరిమానా విధిస్తామని స్థానికులు ఆదివారం దండోర వేయించారు. -
తల్లీకూతుళ్ల ఆత్మహత్య
తల్లీకూతుళ్ల ఆత్మహత్య ఉన్న ఊరు వదిలి కూలీ పనులు చేసి పిల్లలను ప్రయోజకులను చేద్దామని ఆశించింది తల్లి... తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను భవిష్యత్‌లో తానైనా అధిగమించాలని భావించింది కూతురు. కానీ విధి ఆడిన నాటకంలో తల్లీకూతుళ్లు విగతజీవులుగా మారారు. ఇంటి పెద్ద వేధింపులు వారిద్దరూ ఊపిరి తీసుకునేలా చేశాయి. విషపు గుళికలు మింగి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మండలంలోని గుండంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ుండంపల్లి(దిలావర్పూర్), : నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన పస్తం సాయన్న తన భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలతో కలిసి ఐదేళ్ల క్రితం మండలంలోని గుండంపల్లి గ్రామానికి బతుకుదెరువు కోసం వలస వచ్చాడు. గుడిసె వేసుకుని.. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సాయన్న కొంతకాలంగా మద్యం సేవిస్తూ తన భార్య లక్ష్మిని తరచూ వేధిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం అతిగా మద్యం సేవించి తాను పురుగుల మందు తాగానంటూ కుటుంబ సభ్యులతోపాటు 108సిబ్బందిని ఆటపట్టించాడు. పురుగుల మందు తాగలేదంటూ కుటుంబ సభ్యులను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో లక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది. సాయన్న చిన్న కుమారుడు సాయికుమార్‌తో కలిసి వేరే గ్రామానికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మి(35) విషపు గుళికలు తిని తన కూతురు లావణ్య(12)కు తినిపించింది. రెండు గంటల సమయంలో మరో కుమారుడు సింహాంద్రి(7) చూసి ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు పరిశీ లించగా అప్పటికే లక్ష్మి మృతిచెందింది. 108 సిబ్బంది వచ్చేసరికి లావణ్య కూడా చనిపోయింది. లావణ్య స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ రఘు, నర్సాపూర్(జి) ఎస్సై అనిల్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు -
గుప్పుమంటున్న గుడుంబా
గుప్పుమంటున్న గుడుంబా గండేడ్, : గ్రామాల్లో సారా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పచ్చని పల్లెల్లో సారా రక్కసి కోరాలుచాచి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో అక్రమార్కుల వ్యాపారం సాఫీగా సాగుతోంది. దీంతో కల్తీసారాతో జనం మృత్యువాతపడుతున్నారు. మండల పరిధిలోని మొకర్లాబాద్, మహమ్మదాబాద్, షేక్‌పల్లి, చిన్నాయపల్లి, కొంరెడ్డిపల్లి, కొండాపూర్, పగిడ్యాల్, పెద్దవార్వాల్, చిన్నవార్వాల్, రుసుంపల్లి, గాధిర్యాల్,నంచర్ల తదితర గ్రామాల్లో విచ్చలవిడిగా సారా అమ్మకాలు జరుగుతున్నాయి. అధిక ధరలు పెట్టి మద్యం కొని తాగలేని పేదలు సారాకు బానిసవుతున్నారు. ఇటీవల మొకర్లాబాద్ గ్రామంలో ఇద్దరు సారా మత్తులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రమాదకరమైన కాలిపోయిన బ్యాటరీసెల్స్, పటిక, నవసాగరం, యూరియా తదితర సామగ్రితో అక్రమార్కులు సారా తయారు చేయడంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. కనిపించని ఎక్సైజ్ దాడులు ఎక్సైజ్ అధికారులు సారా తయారీదారుల నుంచి మామూళ్లు తీసుకొని దాడులు నిర్వహించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫోన్లో సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని మండిపడు తున్నారు.