
నిందితుడిని చూపుతున్న కానిస్టేబుల్
ములుగు(గజ్వేల్) : ములుగు మండలంలోని రెండు బెల్ట్‌షాపులపై సోమవారం దాడులు నిర్వహించినట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు. వారి వద్ద నుంచి మద్యం స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. క్షీరసాగర్ గ్రామానికి చెందిన తాటికొండ రేణుక తన ఇంట్లోనే బెల్ట్‌షాపును నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేశామన్నారు.
దాడుల్లో 10 బీ రు సీసాలు లభ్యమయినట్లు చెప్పారు. అన్నసాగర్‌లో మక్తాల వెంకటేశ్ అనే వ్యక్తి కల్లు దుకాణంతో పాటు బెల్టుషాపు నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో దాడిచేయగా 20 క్వార్టర్ సీసాలు లభ్యమైనట్లు ఎస్‌ఐ చెప్పారు. మ ద్యం సీసాలు స్వాధీనం చేసుకుని రేణుక, వెం కటేశ్‌పై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment