bottles of alcohol seized
-
కర్ణాటక మద్యం స్వాధీనం
అన్నానగర్: వాణియంబాడి సమీపంలో మంగళ వారం రాత్రి కారుతో పాటు కర్నాటక రాష్ట్ర మద్య బాటిళ్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ పోలీసు ఇన్స్పెక్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో చెట్టియప్పనూర్ జంక్షన్ రోడ్డులో మంగళవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ కారును పోలీసులు ఆపేందుకు యత్నించారు. అప్పుడు డ్రైవర్ కారును ఆపి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు కారును సోదా చేయగా అందులోని 1,248 కర్ణాటక రాష్ట్ర మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు రోలర్‌తో తొక్కించి.. రూ.3.14 కోట్ల మద్యం ధ్వంసం (ఫొటోలు)
-
నగదు, మద్యం స్వాధీనం
సాక్షి, వీరఘట్టం (శ్రీకాకుళం): మండలంలోని రేగులపాడు సమీపంలో శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆధారాల్లేని రూ.1.50 లక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ జి.సుబ్రహ్మణ్యం పట్టుకున్నారు. వీరఘట్టం మండలం చలివేంద్రికి చెందిన అలజంగి కృష్ణ ఎల్ఐసీ ప్రీమియం కట్టేందుకు ఈ డబ్బులు తీసుకువెళుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు అతని వద్ద లేవని పోలీసులు తెలిపారు. ఈ నగదును పోలీసులకు అప్పజెప్పడంతో ఎస్ఐ జి.అప్పారావు కేసు నమోదు చేశారు. 714 మద్యం బాటిళ్లు సీజ్ సరుబుజ్జిలి: అనధికారకంగా రవాణా జరుగుతున్న మద్యం బాటిళ్లను సరుబుజ్జిలి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సరుబుజ్జిలి ఎస్ఐ డి.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం సభ్యులు అలికాం–బత్తిలి రహదారిలో తనిఖీలు చేస్తుండా 714 క్వార్టర్ బాటిళ్లు పట్టుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ కోసం ఈ మద్యం తరలిస్తున్నట్లు అనుమానం వచ్చి సరకును సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు గురుమూర్తి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నందిగాంలో రూ.68,000.. నందిగాం: ఎన్నికల నిర్వహణలో భాగంగా మండల పరిధిలో కొత్తగ్రహారం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీల్లో అనధికారంగా ఉన్న రూ.68,000 పట్టుబడిందని నందిగాం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక సిబ్బంది శేషు, దేవదాయశాఖ ఈఓ గురునాథ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతుండగా భువనేశ్వర్ నుంచి జైపూర్ వెళ్తున్న కారులో రూ.68వేలను గుర్తించారన్నారు. కారు యజమాని ఎల్.వి.ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని నగదను స్టేషన్‌కు తరలించామన్నారు. వెంకటాపురంలో రూ.51,500.. లావేరు: మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అనధికారికంగా తీసుకువెళుతున్న రూ.51,500 నగదును అధికారులు పట్టుకున్నారు. చెక్‌పోస్టు ఇన్చార్జి అల్లు సోమేశ్వరరావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం చెక్‌పోస్టు ఇన్చార్జి అల్లు సోమేశ్వరరావు, వీఆర్వో కిరణ్మయి, లావేరు పోలీసులు వాహనాలు తనిఖీ చేపడుతుండగా మండలంలోని బెజ్జిపురం గ్రామానికి చెందిన కోరాడ సాయిబాబు ద్విచక్రవాహనంతో నగదును తీసుకుని వెళుతుండగా తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు. నగదు ఎలా వచ్చిందో అధికారులకు సరైన ఆధారాలను వెంటనే చూపించలేదన్నారు. దీనిపై లావేరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇచ్ఛాపురంలో రూ..2,38,500.. ఇచ్ఛాపురం: ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం చెక్‌పోస్టు, ముశ్చింద్ర చెక్‌పోస్టుల వద్ద ఎస్ఎస్టీ, ఫ్లైయింగ్ స్క్వాడ్, పోలీస్ సిబ్బంది శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల్లో అనధికారంగా తరలిస్తున్న రూ.2,38,500 నగదును పట్టుకున్నారు. ఎస్ఎస్టీ, ఫ్లైయింగ్ స్క్వాడ్ తెలిపిన వివరాల మేరకు పురుషోత్తపురం చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాలోని బరంపూర్ నుంచి కొరాపుట్‌కు బోలెరో వాహనంలో వెళ్తున్న ఉమాశంకర్ సాహు వద్ద రూ.78,000, సుజ్జీవ్సుబిద్ధి వద్ద రూ.52,500, కేసి పాణిగ్రాహి వద్ద రూ.50,000 ఉన్నట్లు గుర్తించారు. ఆ నగదుకు సంబంధించిన సరైన పత్రాలకు చూపకపోవడంతో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఎస్టీ ఎం.గణపతి తెలిపారు. ముశ్చింద్ర గ్రామం పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.58,000 నగదును పోలీసీలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశం సీఐ కె.పైడపునాయుడు మాట్లాడుతూ సరైన ఆధారాలు లేకుండా రాజకీయ పార్టీ కరపత్రాలు, జెండాలు తరలించవద్దన్నారు. ఎటువంటి మారణాయుధాలు ఉండరాదన్నారు. పట్టణ ఎస్ఐ సింహాచలం, రూరల్ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
12 మద్యం సీసాలు స్వాధీనం
విజయనగరం రూరల్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఈఎస్ టాస్క్‌ఫోర్స్ విభాగం సీఐ చక్రవర్తి ఆధ్వర్యంలో సిబ్బంది విజయనగరం ఎక్సైజ్ స్టేషన్–1 పరిధి శాంతినగర్‌లోని బెల్ట్‌షాపుపై ఆదివారం దాడిచేసి 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దుకాణం యజమాని గాజులరేగకు చెందిన కర్రి శంకరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేవారు. దాడుల్లో ఎక్సైజ్ ఈఎస్ టాస్క్‌ఫోర్స్ హెచ్‌సీ ఎం.రామారావు, కానిస్టేబుళ్లు బాషా, లోకాభిరాం, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
బెల్టు షాపులపై దాడులు
అనంతగిరి, న్యూస్‌లైన్: బెల్టు దుకాణాల్లో దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ పేర్కొన్నారు. శనివారం ఆయన వికారాబాద్‌లోని సర్కిల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పూడూరు మండలం గట్టుపల్లిలో ఓ మహిళ ఇంట్లో దాడులు చేసి 480 సారా ప్యాకెట్లు, 44 నాకౌట్ బీర్లు, 28 క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీంతో పాటు మంచన్‌పల్లి గ్రామంలో రాంచంద్రయ్య ఇంట్లో తనిఖీలు చేసి 12 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు నిందితులను రిమాండుకు తరలించినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. సారా బట్టీలపై దాడులు మర్పల్లి: పలు తండాల్లో ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో షాపూర్ తండా, దామస్తాపూర్ తండా, బంట్వారం మండలం నాగారం తండాలో తనిఖీలు చేశారు. 4,050 లీటర్ల ఊట బెల్లంతో పాటు 110 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. మరో ఘటనలో.. శనివారం సాయంత్రం ఓ ఆటో(ఏపీ 28 వీ 0052)లో మర్పల్లి నుంచి కోటమర్పల్లికి తరలిస్తున్న 192 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి డ్రైవర్ మహ్మద్జలీల్ను రిమాండుకు తరలించినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుధాకర్‌వర్మ, ఎస్సైలు శ్రీనివాస్, రఘురాంరెడ్డి, సిబ్బంది ఉన్నారు. వేర్వేరు ఘటనల్లో మద్యం పట్టివేత తాండూరు టౌన్: వేర్వేరు ఘటనల్లో పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం.. పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామానికి చెందిన కోట్ల మల్లికార్జున్ ఓ ఆటోలో 239 క్వార్టర్ బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తాండూరు మండలం నారాయణపూర్‌కు చెందిన సురేష్ నుంచి 25 క్వార్టర్ బాటిళ్లు, యాలాల మండలం ఎన్కేపల్లి గ్రామస్తుడు బీటీ గోవింద్ వద్ద 45 క్వార్టర్ బాటిళ్లు, పెద్దేముల్ మండలం కోటపల్లికి చెందిన కోమలి శ్రీనివాస్ క్వాలిస్‌లో తరలిస్తున్న 90 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితులు మల్లికార్జున్, సురేష్, బీటీ గోవింద్, శ్రీనివాస్‌లతో పాటు క్వాలిస్ డ్రైవర్ జైపాల్‌రెడ్డి, ఆటో డ్రైవర్ ఇస్మాయిల్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. క్వాలిస్‌ను సీజ్ చేసినట్లు సీఐ చెప్పారు.