దొంగలుంటారు జాగ్రత్త అని చెప్పి..
రంగారెడ్డి: బంగారు నగలు వేసుకొని బయటకు వెళ్తున్నారు.. జాగ్రత్తమ్మా అసలే రోజులు బాగాలేవు.. దొంగలుంటారు జాగ్రత్తా అని చెప్పి మహిళతో మాటలు కలిపి దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసులాక్కెళ్లారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. కాలనీలో ఆటో దిగి ఇంటికి వెళ్తున్న విజయ అనే మహిళను వెంబడించిన దుండగులు ఆమెతో దొంగలు ఉంటారు జాగ్రత్త అని చెప్పి మరీ ఆమె మెడలోని బంగారు నగలు లాక్కెళ్లారు. పల్సర్ బైక్ పై వచ్చినట్లు గుర్తించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది.