
కారును తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపు రోడ్డుపై బోల్తా పడింది.
రాజేంద్రనగర్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపు రోడ్డుపై బోల్తా పడింది. పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే పై ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు కావడంతో వెంటనే వారు కారు దిగి వెళ్లిపోయారు. పోలీసుల కథనం ప్రకారం... ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 219పై మెహిదీపట్నం నుంచి నుంచి శంషాబాద్ వైపు వేగంగా దూసుకెళ్తున్న కారు (కేఏ 03 ఏసీ 0068) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. అవతలి వైపు రోడ్డుపై పడి రెండు పల్టీలు కొట్టింది. ఆ సమయంలో ఆ రోడ్డులో ఎలాంటి వాహనాలు వెళ్లకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లిపోయారు. కాగా, ఈ ప్రమాదం వల్ల ఎక్స్‌ప్రెస్‌వేపై అరగంట ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంపై రాత్రి వరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రమాదానికి గురైన కారు కర్ణాటక రిజిస్ట్రేషన్‌పై ఉండటంతో ఆ కారు ఎవరిదన్న దానిపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.