
రాతిలో దాగి..
రాజేంద్రనగర్: మిర్యాలడూడ ఓడపల్లి కాలువలో దొరికిన రాతి గణపతి ప్రతిమను సోమవారం రాజేంద్రనగర్‌లో ప్రతిష్టించారు. గణనాథుడి రూపంలో ఈ రాయిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ గుర్తించారు. ఈ ప్రతిమను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.