
అత్తాపూర్‌లో సెల్‌టవర్‌కు మంటలు!
రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గృహసముదాయాల్లో ఓ అపార్ట్‌మెంట్‌పై ఉన్న సెల్‌టవర్ జనరేటర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగజిమ్మాయి. సెల్‌టవర్‌కు మంటలు అంటుకొని పెద్ద ఎత్తున ఎగిశాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.