హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అత్తాపూర్‌లోని ఏవీ-1 కూలర్‌ల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఆరుగురు సజీవదహనం అయ్యారు. మృతులను బీహార్ రాష్ట్రానికి చెందిన.. సద్ధాం, సాధు, ఇర్ఫాన్ ఖాన్, ఆయుబ్ ఖాన్‌లుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఫ్యాక్టరీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ మూలంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ ఏసీపీ గంగిరెడ్డి పరిశీలించారు.