సాక్షి,హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలోని థర్మకోల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల వెలువడిన దట్టమైన పొగలవల్ల స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో గ్యాస్ సిలిండర్లు ఉండటం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ ఏడాది మార్చిలోనూ గగన్‌పహాడ్ ప్రాంతంలోని ఓ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయలయ్యాయి. పేలుడు కారణంగా వెలువడిన శబ్దంతో చుట్టుపక్కల వారు అప్పట్లో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఇదీచదవండి..కారులో డబ్బుల సంచులు.. సీఐపై కాంగ్రెస్ నేత దాడి!
Comments
Please login to add a commentAdd a comment