Industrial Area
-
కాలుష్య కోరల్లో కుత్బుల్లాపూర్
-
అక్కడ అన్నీ ఉన్నాయ్.. అధికారుల నిర్లక్ష్యంతో సహా!
రామగుండం: సహజ వనరులకు కొదవ లేదు.. శ్రామిక శక్తికి ఏలోటూ లేదు.. స్థలం కొరత అంతకన్నా లేదు.. నిధుల విడుదలలో ఏమాత్రం జాప్యం కావడంలేదు.. ఉన్నదంతా నిలువెల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే.. అందుకే రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తొలి థర్మల్ విద్యుత్ రామగుండంలోనే.. ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి థర్మల్ విద్యుత్ కేంద్రం రామగుండంలోనే నిర్మించారు.అంటే రామగుండం పారిశ్రామి ప్రాంతం ప్రాధాన్యత ఎంతఉందో అర్థం చేసుకోవచ్చు. ►ఎన్టీపీసీ, బీ–థర్మల్, రైల్వేస్టేషన్, సింగరేణి బొగ్గు గనులు, ఎరువుల తయారీ కంపెనీ, సిమెంట్ కంపెనీ తదితర పరిశ్రమలు రామగుండం పేరిట స్థాపించారు. ► రాముడు సీతను నడియాడిన నేల కూడా ఇక్కడే ఉంది. ► రాముడు–సీతాదేవి సంచరించిన ఆనవాళ్లు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయని చర్రికారులు చెబుతున్నారు. ►ఇందుకు నిదర్శనంగా భక్తులు ఆయా ప్రాంతాలను దర్శించుకొని పునీతులవుతున్నారు. పర్యాటకంపై దృష్టి సారిస్తే.. పట్టణ సమీపంలోని రామునిగుండాల ఆధ్మాత్మికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రామలక్ష్మణుడు, సీతాదేవి ఇక్కడ సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కొండపై 108 గుండాలు ఉండగా ఇందులో ఒకగుండం 200 అడుగుల లోతు, 50 అడుగుల వెడల్పుతో ఓలోయ ఉంది. రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. 108 గుండాల్లో అన్నికాలాల్లోనూ నీరు సమృద్ధిగా లభిస్తూ ఉండడం ఇక్కడి విశేషం. ఇందులో ప్రధానమైనవి పాలగుండం, నేతిగుండం, జీడిగుండం, పసుపుగుండం, తొక్కుడుగుండం, యమగుండం, ధర్మగుండం, మోక్షగుండం ఉన్నాయి. కొండపై లోయ.. సొరంగం.. ►రామునిగుండాల కొండపై లోయ మధ్యలో సొరంగ మార్గం ఉంది. దీనిని యమకోణమని పేర్కొంటారు. ►ఈ సొరంగం గుండా నిత్యం నీరు పారుతూ ఉంటుంది. ► ప్రతీ శ్రావణ, కార్తీకమాసంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీసీతారామ లక్ష్మణులను దర్శించుకుంటారు. ►ఇంతటి ప్రాధాన్యం కలిగిన రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. ► కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా రామగుండం ప్రాధాన్యం గుర్తించి దీని పేరిటనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తారని భావించినా జాబితాలో ఆ పేరు లేకపోవడంతో ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు. మూలనపడ్డ ప్రణాళిక.. రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో 2007లో అప్పటి మున్సిపల్ చైర్మన్ రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇస్కాన్ సంస్థను సంప్రదించారు. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‌లోని బిర్లా మందిర్ తరహాలో దేవాలయం, కొండకింద నుంచి పైకి రోప్‌వే నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇస్కాన్ ప్రతినిధులు కూడా క్షేత్రసందర్శనకు రాగా అటవీశాఖ అధికారుల అభ్యంతరంతో అభివృద్ధికి ఆటంకాలు ఎదురయ్యాయి. భూ వివాదాస్పద అంశాలతో ఇస్కాన్ సంస్థ ముందుకు రాలేదు. అభివృద్ధికి ఆమడదూరం రామునిగుండాలను అభివృద్ధి చేసేందుకు అటవీ భూముల సాకుతో అభివృద్ధికి నోచుకోకపోవడం లేదు. ఆధ్యాత్మిక చరిత్ర క లిగిన ప్రాంతాలను వివక్ష లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అర్హత ఉన్నా పాలకుల ఆధిపత్య ధోరణితో అభివృద్ధికి దూరంగా ఉంది. – భట్టు ప్రసాద్, పట్టణవాసి అవకాశం ఉన్నా.. రామగుండం పేరిట ఉన్న ప్రతీ పరిశ్రమకు సామాజిక బాధ్యత పథకం (సీఎస్ఆర్)కింద నిధులు విడుదల చేసి అభివృద్ధి పరిచే అవకాశం ఉంది. కానీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడి పరిశ్రమల నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులను పాలకులు వేరే ప్రాంతాలకు తరలించుకెళ్లారు. ఏ ప్రాంతమైనా ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అన్ని రంగాలు ప్రగతి సాధిస్తాయి. – ముస్త్యాల శంకర్లింగం, పట్టణవాసి -
రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం..భయాందోళనలో స్థానికులు
సాక్షి,హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలోని థర్మకోల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల వెలువడిన దట్టమైన పొగలవల్ల స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో గ్యాస్ సిలిండర్లు ఉండటం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఏడాది మార్చిలోనూ గగన్‌పహాడ్ ప్రాంతంలోని ఓ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయలయ్యాయి. పేలుడు కారణంగా వెలువడిన శబ్దంతో చుట్టుపక్కల వారు అప్పట్లో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇదీచదవండి..కారులో డబ్బుల సంచులు.. సీఐపై కాంగ్రెస్ నేత దాడి! -
నాచారం మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
-
హైదరాబాద్: మల్లాపూర్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. తాజాగా మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్మేసింది. ఈ క్రమంలో పక్కన ఉన్న హల్దీరామ్ గోదాంకు ఈ మంటలు వ్యాపించాయి. సమచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కాసేపు తర్వాత మంటలు భారీ స్థాయిలో మళ్లీ చెలరేగాయి. దీంతో 11 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని చెప్పుల పరిశ్రమలో మంగళవారం ఉదయం ఉన్నట్టుండి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుంది. పది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురిని రక్షించారు. మరికొంత మంది మంటల్లో చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. #Breaking: 2 dead, several trapped in an incident of fire occurred in a footwear factory in Delhi's Narela Industrial Area.#fire #Narelafire #Delhifire pic.twitter.com/QSJ1VqEwV4 — India.com (@indiacom) November 1, 2022 -
పిల్లి చేసిన పని...100 కోట్ల నష్టం
సాధారణంగా ఇళ్లలో జంతువులు చేసిన పనులు కొన్ని సార్లు నష్టాలను మిగిలేలా చేస్తాయి. తాజాగా ఓ పిల్లి కారణంగా లక్షలు కాదు, 100 కోట్లు నష్టాలను తెచ్చిపెట్టింది. మహారాష్ట్రలోని పుణె పట్టణం శివార్లలో పింప్రీ-చించ్వడ్ ప్రాంత. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతమైన భోసారిలో వ్యాపారస్తులు ఎక్కువ. ఓ పిల్లి ట్రాన్స్ ఫార్మర్ మీదకు ఎక్కడంతో అక్కడి కరెంట్ తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూ్ట్ అయ్యింది. దీంతో భోసారితో పాటు భోసారి ఎం.ఐ.డి.సీ ప్రాంతమంతా కరెంట్ అంతరాయం ఏర్పండింది. సుమారు 60 వేల మంది వినియోగదారులకు కరెంట్ సరఫరా కట్ అయ్యింది. ఫలితంగా దాదాపు 7000 మంది వ్యాపారస్తుల దుకాణాలకు పవర్ నిలిచిపోయింది. దీని వల్ల సుమారు రూ.100 కోట్ల రూపాయిలకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు. మరల కరెంట్ సరఫరాను మళ్లీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలంటే.. మూడు రోజులైనా పడుతుందని అధికారులు తెలిపారు. అయినా ఇంతటి నష్టానికి, కష్టానికి కారణం.. పిల్లి అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. -
వామ్మో.. ఆ నీళ్లు తాగితే డైరక్ట్ దవాఖానానే..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడల్లో భూగర్భజలం తీవ్రంగా కలుషితమైంది. పలు పరిశ్రమలు విడుదల చేస్తున్న పారిశ్రామిక వ్యర్థజలాలను నాలాలు, బహిరంగ ప్రదేశాలు, వట్టిపోయిన బోరుబావుల్లో వదిలివేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల్లో భారలోహాలు, నైట్రేట్లు, పాస్ఫరస్ తదితర మూలకాల ఉనికి కనిపించినట్లు జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) ప్రాథమిక అధ్యయనంలో తేలింది. పూర్తిస్థాయి నివేదిక ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి సిద్ధమవుతుందని ఆ సంస్థ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. భూగర్భ జల కాలుష్యానికి ప్రధాన కారణాలివే.. ► మహానగరం పరిధిలోని 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భజలాలు, చెరువుల నీటి నమూనాలను ఇటీవల ఎన్జీఆర్ఐ (జాతీయ భూ¿ౌతిక పరిశోధన సంస్థ) సేకరించి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించింది. ► ప్రధానంగా నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లో కరిగిన ఘన పదార్థాలు, నైట్రేట్లు, పాస్ఫరస్ అధికంగా ఉండడంతోపాటు భార లోహాల ఉనికి బయటపడింది. ► పలు రసాయన, బల్‌్కడ్రగ్, ఫార్మా పరిశ్రమల నుంచి బహిరంగ ప్రదేశాలు, సమీప చెరువులు, నాలాలు, మూసీలోకి దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థజలాలు చేరడం. ఈ జలాలు క్రమంగా భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి. ► రోజువారీగా గ్రేటర్లో 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో 700 మిలియన్ లీటర్ల నీటినే శుద్ధిచేసి మూసీలోకి వదిలిపెడుతున్నారు. ► మిగతా 700 మిలియన్ లీటర్ల జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ నిర్వహించకుండానే మూసీలో కలుస్తున్నాయి. ► ఇందులో సుమారు 350 మిలియన్ లీటర్ల మేర పారిశ్రామిక వ్యర్థజలాలున్నాయి. ఈ నీరు క్రమంగా భూగర్భజలాల్లోకి చేరుతుండడంతో భూగర్భజలాలు గరళంగా మారాయి. భూగర్భజలాల్లో ఉన్నమూలకాలు, భారలోహాలివే.. సోడియం, క్యాల్షియం, మెగీ్నీషియం, సెలీనియం, బోరాన్, అల్యూమినియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, నికెల్, ఆర్సెనిక్, జింక్, లెడ్, నైట్రేట్, పాస్ఫరస్. ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలశాఖ నెలవారీగా భూగర్భ జలమట్టాలను లెక్కిస్తోంది. ఇక నుంచి ఆయా ప్రాంతాల్లో బోరుబావులు తవ్వి భూగర్భజలాల నాణ్యత ను ఎన్జీఆర్ఐ సౌజన్యంతో పరిశీలించనుంది. ఈ వివరాలను జీఐఎస్ మ్యాపుల్లో పొందుపరిచి భూగర్భజలశాఖ వెబ్సైట్లో అందరికీ లభ్య మయ్యేలా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ఆ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి నగరంలో పారి శ్రామిక వాడలతోపాటు ఇతర ప్రాంతాల్లో భూ గర్భజలాల నాణ్యతపై పూర్తిస్థాయి నివేదికను ఎన్జీఆర్ఐ సిద్ధం చేయనుందని వెల్లడించాయి. -
మదనపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో పేలుళ్ల కలకలం
సాక్షి, చిత్తూరు: మదనపల్లిలోని ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్ళు కలకలం సృష్టించాయి. భవన నిర్మాణం కోసం డీమార్ట్ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లను పేల్చారు. భారీగా పేలుడు సంభవించడమే గాక బండరాళ్లు ఆ పరిసరాల్లోని నివాస గృహాలపై పడ్డాయి. దీంతో పలు ఇళ్లు దెబ్బతినడంతో పాటు ఐదుగురికి గాయాలుకాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డీమార్ట్ సంస్థపై స్థానికుల మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. -
జిన్నారంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే సరక కంపెనీలో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలిడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీస్తున్నారు. ఎగిసిపడుతున్న మంటలు ఆర్పటానికి అగ్నిమాపక శకట వాహనాల ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాగా, ఈ ప్రమాదంలో కార్మికులు ఉండి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మేడ్చల్ జిల్లా మల్లాపూర్ లో అగ్నిప్రమాదం
-
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు
జిన్నారం: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. పారిశ్రామికవాడలో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు రాధిక మృతి చెందినట్లు సమాచారం. ఈ పేలుడు కారణంగా మరో ఆరుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు దాటికి పరిశ్రమలోని గోడలకు బీటలు పడినట్లు కార్మికులు తెలిపారు. పరిశ్రమలోని కాయల్స్ వేడి చేసే బ్లాక్‌లో ఉష్ణోగ్రత పెరగడంతో ఒక్కసారిగా పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
నిధులిస్తేనే మందికి ఉపాధి అవకాశాలు
సాక్షి, హైదరాబాద్ : అవి పేరున్న వివిధ రంగాల పెద్ద ప్రాజెక్టులు.. అందులో ఏ ఒక్కటి పూర్తయినా ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది.. కావాల్సిందల్లా నిధుల సాయమే.. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వివిధ ప్రాజెక్టులను నిధుల కొరత వెంటాడుతోంది.. కేంద్రం కనుక వచ్చే బడ్జెట్లో నిధులను కేటాయిస్తే అవి గట్టెక్కుతాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 28 వేల ఎకరాల విస్తీర్ణంలో 147 పారిశ్రామిక వాడలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్)లో భాగంగా 14 రంగాలకు సంబంధించి పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 59 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం ఇప్పటివరకు 49 వేల ఎకరాలను గుర్తించగా, సుమారు 39 వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు టీఎస్ఐఐసీ ఇప్పటివరకు సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ, నిమ్జ్ (జహీరాబాద్), కాకతీయ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయాన్ని కోరుతోంది. ఈ ఏడాది వీటిలో మౌలిక వసతుల కల్పన పూర్తయితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. హైదరాబాద్ ఫార్మా సిటీ.. ప్రపంచంలోనే అతిపెద్ద సింగి ల్ ఫార్మా క్లస్టర్ ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. 19,333 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఫార్మాసిటీ ప్రా జెక్టు వ్యయం రూ.28,700 కోట్లుగా అంచనా వేశారు. జీరో లిక్విడ్ డిశ్చార్జి, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ పార్క్, గ్లోబల్ ఫార్మా యూనివర్సిటీ, కామన్ డ్రగ్ డెవలప్మెంట్, టెస్టింగ్ లేబొరే టరీ, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక హబ్ తదితరాలను ఫార్మాసిటీ ప్రణాళికలో చేర్చారు. దీనికి కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణి జ్య శాఖ జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) హోదాను ఇచ్చింది. ఫార్మాసిటీని శ్రీశైలం ప్రధాన రహదారితో అనుసంధానం చేస్తూ వంద ఫీట్ల రోడ్డును నిర్మించారు. ఫార్మా సిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం రూ.4,992 కోట్లను ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో కనీసం రూ.870 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇప్పటికే ఫార్మా రంగానికి చిరునామాగా ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఫార్మాసిటీ పూర్తయితే ఔషధ తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుతుంది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) భవన నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టు లు, మైనింగ్ తదితర రంగాల్లో మౌలిక వసతుల పనుల కోసం ఉపయోగించే యంత్రాల తయారీకి దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక పారిశ్రామిక పార్కు తెలంగాణలో ఏర్పాటు కానున్నది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మేకర్స్ (ఓఈఎం) ఈ పార్కులో తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కుకు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యా క్చరింగ్ జోన్ (నిమ్జ్) హోదాను 2016 జనవరి 7న కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 12,635 ఎకరాల్లో ఏర్పాటయ్యే నిమ్జ్‌కు రూ.13,300 కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయం కాగా, రూ.60 వేల కోట్ల పెట్టుబడులు, 2.77 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పార్కులో మౌలిక వసతుల కోసం తొలి దశలో రూ.500 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. మౌలిక వసతుల కల్పన జరిగితే పరిశ్రమల స్థాపన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంటుంది. నేషనల్ డిజైన్ సెంటర్.. కేంద్ర వాణిజ్య శాఖకు అనుబంధంగా ఉండే పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగంగా రాష్ట్రంలో నేషనల్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సవివర నివేదిక (డీపీఆర్) ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో 30 ఎకరాల స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దేశంలో డిజైనింగ్ పరిశ్రమ సుమారు రూ.19 వేల కోట్లకు చేరుకుంటుందనే అంచనాతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. సెంటర్ ఏర్పాటు కోసం రూ.200 కోట్ల ప్రాథమిక మూలధనం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నేషనల్ డిజైన్ సెంటర్.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఉపాధి వేటలో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన నేత కార్మికులను తిరిగి స్వస్థలాలకు రప్పించి ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ రూరల్ జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు 1,190 ఎకరాలను టెక్స్టైల్ పార్కు కోసం సేకరించారు. ఐఎల్ఎఫ్ఎస్ అనే సంస్థను ప్రాజెక్టు అభివృద్ధి కోసం కన్సల్టెంట్‌గా నియమించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,150.47 కోట్లు కాగా, రూ.11,546 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. పూర్తిస్థాయిలో పెట్టుబడులొస్తే 1.13 లక్షల మందికి ఉపాధి దక్కే అవకాశముంది. పార్కులో మౌలిక వసతులకు అవసరమయ్యే వ్యయంలో సుమారు రూ.500 కోట్ల మేర కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన ‘మెగా టెక్స్టైల్ పార్కు పథకం’కింద అందించే అవకాశముంది. ఇందులో కనీసం రూ.300 కోట్లు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక సదుపాయాల కోసం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 10 వేల మందికి ఉపాధి కల్పించేందుకు రూ.700 కోట్లు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులకు యంగ్వన్ అనే కొరియా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మెగా టెక్స్టైల్ పార్కు పట్టాలెక్కితే పొరుగు రాష్ట్రాలకు ఉపాధి వేటకు వెళ్లిన నేత కార్మికులు తిరిగి వచ్చే అవకాశముంది. మెడికల్ డివైజెస్ పార్కు వైద్య పరికరాల తయారీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటుచేసింది. 250 ఎకరాల్లో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి కాగా, రెండో దశ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. సుమారు రూ.వేయి కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. ఎంఎస్టీ, విర్చో, ప్రోమియో, ప్లస్ ఆక్టివ్ స్టేషన్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అయితే అనుమతులు పొందిన పరిశ్రమల్లో చాలా వరకు ఇంకా పనులు ప్రారంభించలేదు. ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రాధాన్యత.. రాష్ట్రం మీదుగా వెళ్తున్న ముఖ్యమైన జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న వనరులు, అవకాశాలను జోడించి పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 నాటి నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌లో 6 ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించి, జిల్లాల్లోనూ ఉపాధి అవకాశాలు పెంచాలనే ప్రభుత్వ ఉద్దేశం. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–మంచిర్యాల, హైదరాబాద్ నల్లగొండ, హైదరాబాద్–ఖమ్మం ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలి దశలో హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లు, రెండో దశలో మరో మూడు కారిడార్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ‘హైదరాబాద్–వరంగల్’ కారిడార్‌కు రూ.3 వేల కోట్లు, ‘హైదరాబాద్–నాగ్‌పూర్’ కారిడార్‌కు రూ.2 వేల కోట్లు మొత్తంగా 2021–22 కేంద్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేంద్రం నుంచి ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌పై కసరత్తు చేస్తోంది. -
సంగారెడ్డి: భారీ అగ్ని ప్రమాదం
-
సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని ఓ గోదాములో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చోసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 10 మంది ఫైర్ సిబ్బంది సుమారు 2 గంటలు శ్రమ పడి మంటలను అదుపు చేశారు. అదే విధంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి విద్యుత్ అధికారులు ప్రయత్నం చేశారు. ఇక పరిశ్రమ యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధంచిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మృతుని కుటుంబానికి రూ.21లక్షల చెక్కు అందజేత
విజయనగరం: పూసపాటిరేగ పారిశ్రామిక వాడలో ప్రమాదవశాత్తు మరణించిన బాధిత కుటుంబానికి సదరు కంపెనీ తరఫున ఆర్ధిక సాయం సోమవారం అందజేశారు. నగరంలోని ప్రదీప్‌నగర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా కంపెనీ ప్రతినిధుల సమక్షంలో గుర్ల మండలం రాగోలు గ్రామానికి చెందిన మహంతి సంతోషిణికి రూ.21 లక్షల చెక్కును పంపిణీ చేశారు. పూసపాటిరేగ మండలం కందివలస హెచ్‌బిల్ కంపెనీలో గుర్ల మండలం రాగోలుకు చెందిన మహంతి వెంకటరమణ గతంలో పని చేసేవారు. ఏప్రిల్ 11న ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో ఉన్న సమయంలో చనిపోవటంతో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన మజ్జి శ్రీనివాసరావు ఆ మేరకు బాధిత కుటుంభానికి న్యాయం చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, గుర్ల మండలం మాజీ ఎంపీపీ శీర అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు గిడిజాల అప్పలనాయుడు, కొండపల్లి సూర్యారావు పాల్గొన్నారు. -
కార్డ్‌బోర్డు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
ఢిల్లీ : నగరంలోని కార్డ్‌బోర్డు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం భావన ఇండస్ట్రియల్ ఏరియాలోని పరిశ్రమలో మంటలు రావడంతో ఆందోళన రేగింది. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనాస్థలానికి 14 అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలలను ఆర్పుతున్నాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఢిల్లీలోని 29 ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో భావన కారిడార్ ఒకటిగా ఉంది. కాగా గురువారం తెల్లవారుజామున దర్యాగంజ్ సమీపంలోని ఒక వస్త్ర దుకాణానికి చెందిన ఒక గోడౌన్లో మంటలు చెలరేగి బాగానే ఆస్తి నష్టం సంభవించింది. లాక్డౌన్ నేపథ్యంలో చాలా రోజులుగా మూతపడి ఉన్న పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వడంతో తెరుచుకోవడం వరకు బాగానే ఉంది. పరిశ్రమల యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. . వారం వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమల్లో ఏదో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ అనే గ్యాస్ లీకవడంతతో 12 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని నైవేలీ ఫ్యాక్టరీలోను గ్యాస్ లీకవడంతో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చత్తీస్‌గఢ్‌లోనూ ఇదే విధంగా ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు చోటుచేసుకుంది. ఇప్పటికైనా పరిశ్రమలు తెరిచే ముందు యాజమాన్యాలు కనీస జాగ్రత్తలు పాటించడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
వ్యర్థ జలాలతో మృత్యువాత పడుతున్న చేపలు
సాక్షి, పటాన్చెరు: వర్షాకాలం మొదలైంది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల యాజమన్యాలు యద్దేచ్ఛగా కాలుష్య జలాలను వర్షపు నీటితో కలిపి బయటకు వదులుతున్నాయి. దీంతో సమీపంలోని చెరువులు , కుంటలు కాలుష్య జలాలతో నిండిపోతున్నాయి. చేపలు పెంచి వాటిని విక్రయిచి జీవనాన్ని సాగిస్తున్న మత్య్సకారులకు మాత్రం కాలుష్య జలాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. కాలుష్య జలాల ప్రభావంతో చెరువుల్లోని చేపలు మృత్యువాత పడుతు¯న్నాయి. ప్రతి ఏటా ఇదే విధంగా జరుగుతున్నా యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. పీసీబీ అధికారులకు మాత్రం ఎప్పటిలాగే చెరువుల్లోని చేపలు మృతి చెందటంతో పరిశీలనలు చేసి, కాలుష్య జలాల నమూనాలను సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడలతో పాటు గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడల్లో సుమారు 150రసాయన పరిశ్రమలు ఉన్నాయి. పారిశ్రామిక వాడలకు ఆనుకోని చెరువులు, కుంటలు ఉన్నాయి. గడ్డపోతారంలోని అయ్యమ్మ చెరువులో ప్రతి ఏటా మత్య్సకారులు చేప పిల్లను వేసి వాటిని పెంచి విక్రయించి ఉపాధిని పొందుతుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సుమారు రూ. 5లక్షల విలువైన చేప పిల్లలను మత్య్సకారులు చెరువులో వదిలారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షం నీటితో కలిసి చెరువు పైబాగంలో ఉన్న పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థ జలాలు స్థానికంగా ఉన్న అయ్యమ్మచెరువులో కలిశాయి. దీంతో చెరువులో ఉన్న నాలుగు లక్షల చేపపిల్లలు మృతి చెందాయి. మత్య్సకారులు హుటాహుటీన పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేయటంతో ఎప్పలాగే పీసీబీ అధికారులు ఆయా పరిశ్రమల్లో పర్యటించి నమూనాలను సేకరించి, మృతి చెందిన చేపలను పరిశీలించారు. ఏళ్ల కాలం నుంచి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు. కాలుష్య జలాల కారణంగా చెరువులోని చేపలు మృతి చెందినా తగిన నష్టపరిహారాన్ని అందించేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావటం లేదు. నామమాత్రంగా అధికారుల చర్యలు.. వర్షాకాలంలో కాలుష్య జలాలను నియంత్రించటంలో పీసీబీ అధికారులు విఫలమవుతున్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు బయటకు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదు. పరిశ్రమలతో ïపీసీబీ అధికారులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో కాలుష్య జలాల ప్రవాహం వల్ల చెరువుల్లోని చేపలు మృత్యువాత పడ్డ సంఘటనలు చాలా జరిగాయి. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గడ్డపోతారం చెరువులోకి వస్తున్న కాలుష్య జలాలు -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం, ఐదుగురి మృతి
సాక్షి, ఢిల్లీ : జిల్మిల్ పారిశ్రామికవాడలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. నాలుగు అంతస్థులలో ఉన్న ఈ ఫ్యాక్టరీలోని మంటలార్పడానికి దాదాపు 26 ఫైరింజన్లతో అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్, రబ్బరు సానిటరీ వస్తువులను తయారు చేసే ఈ కంపెనీలో మంటలకు గల కారణాలు ఇంకా గుర్తించలేదు. జిల్మిల్ పారిశ్రామిక ప్రాంతమైనా చుట్టుపక్కల నివాస భవనాలు చాలా ఉన్నాయి. వీధులు చాలా ఇరుకుగా, సరైన ప్రణాళిక లేకుండా నిర్మించారని స్థానికులు చెప్తున్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి
సాక్షి, విజయనగరం : జిల్లాలోని బొబ్బిలి ఇండస్ట్రీయల్ గ్రోత్ ఏరియాలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రీయల్ ఏరియాలోని బాలీజీ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిని జగదీష్(35), పలాంటి సురేష్(30)గా గుర్తించారు. క్షతగాత్రులను బొబ్బిలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఫ్యాక్టరిలోని బాయిలర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఓట్ల కోసం ఉత్తుత్తి జీవోలు
అగనంపూడి: పారిశ్రామిక ప్రాంత రోగుల పాలిట సంజీవని, మినీ ఘోషాసుపత్రిగా పేరొందిన అగనంపూడి సీహెచ్‌సీ స్థాయి పెంచుతాం... పరిసర ప్రాంతాల్లోనిప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం... అని గతంలో పల్లా శ్రీనివాసరావు ఓ హామీ ఇచ్చేశారు. అనంతరం ఆ విషయమే మరిచిపోయారు. ఇంతలో ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడిగా ఓ జీవో తీసుకొచ్చేలా ప్రభుత్వంలో మంత్రాంగం నడిపారు. ఇంకేముంది ఘనత వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ జీవో జారీ చేసేశారు. స్థానిక సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మారుస్తున్నామని ప్రకటించేశారు. అంతేతప్ప ఏరియా ఆస్పత్రిగా మారిస్తే ఎంత మంది వైద్యులు అవసరం, ఇతర సిబ్బంది నియామకం, వసతులు, ల్యాబొరేటరీ కల్పన తదితర అంశాలను మాత్రం పట్టించుకోలేదు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌కు 25 రోజుల ముందు తీసుకొచ్చిన ఈ జీవోపై అగనంపూడి, పరిసర ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. మళ్లీ మాయ జీవోలతో ఓట్లు దండుకునేందుకు టీడీపీ నాయకులు డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం హడావుడిగా జీవో జారీ ప్రస్తుతమున్న సీహెచ్‌సీలో పూర్తిస్థాయి వసతులు లేకపోవడంతో పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించిన వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు నగరంలోని కేజీహెచ్‌కు పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మారిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉంది. ప్రస్తుతం సీహెచ్‌సీలో డాక్లర్టు 8 మంది, నర్సులు 9 మంది, ఫార్మాసిస్టు ఒకరు, జూనియర్ అసిస్టెంట్ ఒకరు, ల్యాబ్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు. వీరితోపాటు అవుట్ సోర్సింగ్‌లో తీసుకున్న కాంట్రాక్ట్ సిబ్బంది 15 మంది పనిచేస్తున్నారు. దీన్ని ఏరియా ఆస్పత్రిగా మార్చేశామంటూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతోసహా టీడీపీ నాయకులంతా బాజా మోగిస్తున్నారు. అయితే కనీస చర్యలు చేపట్టకపోవడంతో ఈ ఉత్తర్వులు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఇచ్చారని స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 ఆస్పత్రుల స్థాయి పెంచుతూ అగనంపూడిని కూడా ఆ జాబితాలో చేర్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చిత్తశుద్ధి ఉంటే సిబ్బంది పెంచడం లేదా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేసేవారంటున్నారు. -
పారిశ్రామికవాడ.. దడ
జిన్నారం(పటాన్చెరు) : వరుస చోరీ ఘటనలు పారిశ్రామికవాడల్లో వణుకుపుట్టిస్తున్నాయి. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ దోపిడీలతో అటు వ్యాపారులు, ఇటు స్థాని కులు కలవరానికి గురవుతున్నారు. జిన్నారం మండలం బొల్లారం ఇటీవల మున్సిపాలిటీగా అవతరించింది. ఈ గ్రామంలో 200 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి జనాభా 40 వేలకు పైనే ఉంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడి పరిశ్రమల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒడిషా, బీహార్ లాంటి రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. గుర్తుతెలి యని వ్యక్తులు ఎక్కువగా ఉండే ఈ ప్రాం తంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. గతంలోనూ దుండగులు షాపులను టార్గెట్ చేస్తూ దోపిడీలకు దిగారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇందులో కొన్ని కేసులను మాత్రమే పోలీసులు ఛేదించగలిగారు. చిన్న చిన్న చోరీలతో పాటు ఏకంగా లక్షల విలువైన వస్తువులను చోరీ చేసే స్థాయికి దొంగలు తెగబడ్డారు. జ్యువెలరీ షాపులను లక్ష్యంగా చేసుకోవడం పోలీసులకు సవా ల్గా మారింది. తాజాగా బొల్లారంలోని ఓ నగల దుకాణానికి ఏకంగా కన్నం వేసి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. సీఐస్థాయి పోలీస్ స్టేషన్ ఉండడంతో పాటు, గ్రామంలోని పలు ప్రధాన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించినా, ఇటీవల తరచూ కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నాచోరీలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. షాపుల్లో ఉన్న సీసీ కెమెరాలను మొదట పనిచేయకుండా చేసి తర్వాత తాపీగా వారి పని కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం బొల్లారంలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపుతోంది. తమ షాపులను ఎలా రక్షించుకోవాలా అని వ్యాపారస్తులు ఆందోళనకు గురవుతుండగా, వరుస చోరీ ఘటనలతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు జంకుతున్నారు. -
ఊరవతలికి కాలుష్యం!
గ్రేటర్లో పర్యావరణ హననానికి కారణమవుతోన్న కాలుష్య కారక పరిశ్రమలను దశలవారీగా నగరానికి దూరంగా తరలించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)సన్నాహాలు చేస్తోంది. ఇందులో తొలివిడతగా కాటేదాన్ పారిశ్రామిక వాడలోని సుమారు వెయ్యి కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సైతం గుర్తించినట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరికొన్ని పరిశ్రమలను సైతం ముచ్చెర్ల ఫార్మా సిటీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: తొలిదశలో కాటేదాన్ పారిశ్రామిక వాడలోని సుమారు వెయ్యి కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని మరో వెయ్యి బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమలను ముచ్చెర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి దశలవారీగా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అయితే పరిశ్రమల తరలింపును కాటేదాన్ పారిశ్రామిక వాడకు సంబంధించిన పరిశ్రమల వర్గాలు వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం కాటేదాన్‌లో సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలే అధికంగా ఉన్నాయని, కాలుష్య కారక పరిశ్రమలను ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి మూసివేయించిందని వారు స్పష్టం చేస్తున్నారు. విడతల వారీగా పరిశ్రమల తరలింపు... గ్రేటర్ పరిధిలో కాటేదాన్, జీడిమెట్ల, మల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో ప్రధానంగా ఆయిల్, ప్లాస్టిక్, రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాలు, స్టీలు విడిభాగాలు తదితర కాలుష్య కారక పరిశ్రమలకు కాటేదాన్ నిలయంగా ఉంది. ఈ పారిశ్రామిక వాడ కారణంగా స్థానికంగా ఉన్న నూర్‌మహ్మద్ కుంట కాలుష్యకాసారమైన విషయం విదితమే. అంతేకాదు ఈ వాడ జి.ఓ.111 పరిధిలోనే ఉండడంతో జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు సైతం శాపంగానే పరిణమిస్తోంది. ఈనేపథ్యంలో తొలివిడతగా ఈ పారిశ్రామిక వాడలోని కాలుష్య కారక కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించనున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. కాగా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తరవాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే వీటిలో ఫార్మా, ఇంటర్మీడియెట్, బల్క్‌డ్రగ్ పరిశ్రమలను ముచ్చెర్లలో ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీకి దశలవారీగా తరలించాలని నిర్ణయించారు. పరిశ్రమ వర్గాల అభ్యంతరాలివే.. కాటేదాన్‌లో ప్రస్తుతం సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలే అధికసంఖ్యలో ఉన్నాయని..వీటిలో సమీప గ్రామాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని కాటేదాన్ పారిశ్రామికవాడ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వీటిని ఒకేసారి నగరానికి సుదూరంగా తరలిస్తే కార్మికులకు ఉపాధి దూరమౌతుందని..మరోవైపు పరిశ్రమల తరలింపు చిన్న పరిశ్రమలకు పెనుభారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా ఈ తరలింపును మధ్యతరహా, భారీ పరిశ్రమలకే వర్తింపజేయాలని డిమాండ్ చేస్తుండడం గమనార్హం. -
అందరిదీ అదే దారి
ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్నో అక్రమాలు వాణిజ్య భవనాల నిర్మాణాలకే మొగ్గు ఎక్కువ మంది ఇదే తరహా పనులు సహకారం అందించిన అధికారులు సాక్షిప్రతినిధి, వరంగల్ : పరిశ్రమల స్థాపన పేరిట భూములు తీసుకోవడం, వెంటనే వాటిని మూసివేసి వాణిజ్య భవనాలు నిర్మించిన వ్యవహారం కలకలం రేపుతోంది. పరిశ్రమల స్థాపన, మనుగడ కోసం పనిచేయాల్సిన రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులే... వీటిని మూసివేయించేందుకు సహకరించినట్లు స్పష్టమవుతోంది. పరిశ్రమల స్థాపన కోసం భూములు తీసుకుని వాణిజ్య భవనం నిర్మించిన విషయంలో హైకోర్టు జోక్యంతో పరిశ్రమల శాఖ ఇటీవల తీసుకున్న తాజా నిర్ణయం సంచలనం కలిగిస్తోంది. పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో నిర్మించిన వాణిజ్య భవనాల అనుమతులను రద్దు చేయాలని పరిశ్రమల శాఖ, ఇటీవల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)ని ఆదేశించింది. దీంతో వరంగల్ నగరం ములుగురోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలోని వారిలో ఆందోళన మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాణిజ్య భవనాల అనుమతులను రద్దు చేయాలని పరిశ్రమల శాఖ ఆదేశించడంతో ఆ ప్రాంతంలోని వారికి ఇబ్బందికరంగా మారింది. వరంగల్ నగరంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు దశాబ్దాల క్రితం చర్యలు చేపట్టింది. పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి ఉన్న 130 మందికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) భూములను కేటాయించింది. ములుగు రోడ్డులో సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమల కోసం ఇచ్చింది. భూములు తీసుకున్న ఔత్సాహికులు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించారు. మరోవైపు వరంగల్ నగరం విస్తరించడం మొదలైంది. దశాబ్ద కాలంగా ఇది వేగంగా జరుగుతోంది. భూములకు డిమాండ్ పెరుగుతుండడంతో ధరలు సైతం ఇదే స్థాయిలో ఎగబాకాయి. పరిశ్రమల స్థాపన కోసం భూములు తీసుకున్న వారికి అది అనువుగా కనిపించింది. పరిశ్రమలను బంద్ చేసి తమకు కేటాయించిన భూముల్లో... నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలను స్థాపించారు. నెలవారీగా లక్షల రూపాయల వచ్చేలా ప్రముఖ సంస్థలకు అద్దెకు ఇచ్చారు. పరిశ్రమల కోసం స్థాపించిన భూములను ఇలా వాణిజ్య అవసరాల కోసం వినియోగించకూడదని నిబంధనలను ఉన్నా పరిశ్రమల శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది. హైకోర్టు జోక్యంతో ఇప్పుడు పరిశ్రమల శాఖ చర్యలకు సన్నద్ధమైంది. -
మా ఇష్టం !
ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమాలు వరంగల్‌లో నిబంధనలకు తిలోదకాలు పరిశ్రమలకు ఇచ్చిన భూములు దుర్వినియోగం ఇష్టారాజ్యంగా వాణిజ్య భవనాల నిర్మాణం అన్నింటిపైనా చర్యకు పరిశ్రమల శాఖ ఆదేశం సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరం ములుగు రోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో భారీగా అక్రమాలు జరిగాయి. పరిశ్రమలు స్థాపిస్తామని ప్రభుత్వానికి చెప్పి భూములు తీసుకున్న కొందరు.. పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారు. ప్రభుత్వ స్ఫూర్తిని పక్కనబెట్టి తమకు లాభమైన పనులు చేశారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే విషయాలను పట్టించుకోకుండా ఆ భూముల్లో ఇష్టం వచ్చినట్లుగా భారీ భవంతులు నిర్మించి, బడా వాణిజ్య సంస్థలకు కిరాయికి ఇచ్చారు. సొంత లాభం మాత్రమే చూసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమల శాఖ అధికారులు సైతం.. పరిశ్రమలను మూసివేసిన వారికే మద్దతు పలికారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోకుండా అక్రమార్కులకు అంటకాగారు. పారిశ్రామిక ప్రాంతంలో నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, దీనిపై స్పందించాలని హైకోర్టు పరిశ్రమల శాఖను ఆదేశించింది. దీంతో పరిశ్రమల శాఖ తాజాగా ఇచ్చిన ఆదేశాలు సంచలనం కలిగిస్తున్నాయి. ‘పరిశ్రమల స్థాపన కోసం భూములు తీసుకుని... సొంత అవసరాల కోసం భవనాలు నిర్మించిన అంశంలో చర్యలు తీసుకోవాలి. వరంగల్ నగరం ములుగురోడ్డు పారిశ్రామిక ప్రాంతంలో 2009 ఫిబ్రవరి 7, అక్టోబరు 1 తేదీల్లో అనుమతులు పొందిన కంది జితేందర్‌రెడ్డి, కంది సరళాదేవి నిర్మించిన భవనాల అనుమతులను రద్దు చేయాలి. వాణిజ్య భవనాలు నిర్మిస్తున్న సమయంలో చర్యలు తీసుకోకుండా వ్యవహరించిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వరంగల్ జోనల్ మేనేజర్ సి.హెచ్.ఎస్.ఎస్ ప్రసాద్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. వరంగల్ ములుగు రోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల స్థాపన కోసం భూములు పొంది ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న వారి విషయంలో విచారణ జరపాలి’ అని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ నెల 12న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) సీఎండీని ఆదేశించారు. దీనిపై తదుపరి చర్యలు త్వరలోనే మొదలుకానున్నాయి. ‘వరంగల్ నగరం ములుగురోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల స్థాపన కోసం కేటాయించిన భూమి(715 సర్వే నంబర్)లో శ్రీ వెంకటేశ్వర ఆటోమోటివ్స్‌కు చెందిన కంది జితేందర్‌రెడ్డి, కంది సరళాదేవి వాణిజ్య భవనం(15–1–422/ఎ,బి) నిర్మించారు. ఎల్ఐసీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, ఎర్గో, టాటా మోటార్స్ ఫైనాన్స్ వంటి సంస్థలకు లీజుకు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ వ్యవహారంపై స్పందించి భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నాము’ అని వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్(13/2016) వేశారు. హైకోర్టు దీన్ని స్వీకరించింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ కార్యదర్శిని ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఆదేశించింది. నెలలు గడిచినా దీనిపై పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోలేదు. దీంతో పిటిషనర్ మళ్లీ హైకోర్టును ఆశ్ర యించారు. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. పరిశ్రమల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దీంతో పరిశ్రమల శాఖ చర్యలు మొదలుపెట్టింది. భవన నిర్మాణదారును, పిటిషనర్‌ను పిలిచి రికార్డులు స్వీకరించింది. అన్ని అంశాలను పరిశీలించి నిబంధనల ఉల్లంఘించారని నిర్ధాణకు వచ్చింది. చర్యలు తీసుకోవాలని టీఎస్ఐఐసీ సీఎండీని ఆదేశించింది. చర్యలు తీసుకుంటాం వరంగల్ ములుగురోడ్డు పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి ఓ కేసు ఉంది. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన అంశంపై ఈ కేసులో పరిశ్రమల శాఖ కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకుంటాం. – ఇ.వి.నర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ సీఎండీ.