
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని ఓ గోదాములో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చోసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 10 మంది ఫైర్ సిబ్బంది సుమారు 2 గంటలు శ్రమ పడి మంటలను అదుపు చేశారు. అదే విధంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి విద్యుత్ అధికారులు ప్రయత్నం చేశారు. ఇక పరిశ్రమ యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధంచిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.