ఐడీఏ బొల్లారం పారిశ్రామిక‌వాడ‌లో పేలుడు | Blast In IDA Bollaram Industrial Area | Sakshi
Sakshi News home page

ఐడీఏ బొల్లారం పారిశ్రామిక‌వాడ‌లో పేలుడు

Published Sun, Feb 21 2021 7:36 PM | Last Updated on Sun, Feb 21 2021 9:54 PM

Blast In IDA Bollaram Industrial Area - Sakshi

జిన్నారం: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. పారిశ్రామికవాడలో ఉన్న ఒక ఎలక్ట్రానిక్‌ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు రాధిక మృతి చెందినట్లు సమాచారం. ఈ పేలుడు కారణంగా మరో ఆరుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు దాటికి పరిశ్రమలోని గోడలకు బీటలు పడినట్లు కార్మికులు తెలిపారు. పరిశ్రమలోని కాయల్స్‌ వేడి చేసే బ్లాక్‌లో ఉష్ణోగ్రత పెరగడంతో ఒక్కసారిగా పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement