సాక్షి, సంగారెడ్డి: ఐడీఏ బొల్లారంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సింహ దంపతులు గాంధీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమె తిరిగి భర్త వద్దకు రావడానికి నిరాకరిచింది.
దీంతో భార్య కాపురానికి రావటం లేదని ఆదివారం ఉదయం అత్త ఇంటికి వెళ్లి తన భార్య, అత్తను విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటనలో తన భార్య, అత్త అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితుడు నర్సింహ పోలీసుస్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: డబ్బుల కోసం భర్తనే
Comments
Please login to add a commentAdd a comment