
రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ మైలారెడ్డిపల్లి డివిజన్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీలో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసి పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.