
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ఉన్న కారు సినిమా రేంజ్‌లో డివైడర్‌ను ఢీకొట్టి.. అనంతరం మరో కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు రెండు వీల్స్ ఊడిపోయి గాల్లోకి ఎగిరి కిందపడ్డాయి.
వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజూమన హైస్పీడ్‌లో ఉన్న కారు.. 198వ పిల్లర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం, మరో కారును కూడా సదరు కారు ఢీకొట్టింది. ఈ సందర్బంగా కారు రెండు టైర్లు ఉడిపోయి.. ఒక్కసారిగా గాల్లోకి లేచి కిందకు ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, మైనర్లు ఈ కారు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్?
Comments
Please login to add a commentAdd a comment