రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి,హసన్‌నగర్,ఇందిరానగర్ ప్రాంతాల్లో పోలీసులు కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి,హసన్‌నగర్,ఇందిరానగర్ ప్రాంతాల్లో పోలీసులు కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు నేతృత్వంలో 40మంది పోలీసు అధికారులు,200 మందికి పైగా పోలీసులు మూకుమ్మడిగా ఇంటింటి తనిఖీలు చేపట్టారు.
సరైన ధ్రువపత్రాలు లేని కార్లు, ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు వివిధ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్థులతో, రౌడీషీటర్లు, 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.