ఇంటికి కన్నం వేసిన దొంగలు.. అక్కడ విలువైన వస్తువేలవీ దొరక్కపోవటంతో ఏకంగా ఇంటికి నిప్పుపెట్టి పరారయ్యారు.
- పుప్పాలగూడలో దొంగల బీభత్సం
రాజేంద్రనగర్: ఇంటికి కన్నం వేసిన దొంగలు.. అక్కడ విలువైన వస్తువేలవీ దొరక్కపోవటంతో ఏకంగా ఇంటికి నిప్పుపెట్టి పరారయ్యారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటికి
పుప్పాలగూడలోని తులిప్‌గార్డెన్ అపార్టుమెంటులోని ఓ ఫ్లాట్ లో మహేష్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నివసిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆదివారం రాత్రి లోపలికి ప్రవేశించిన దొంగలు.. బీరువాను పగులగొట్టి 10 తులాల బంగారం చోరీచేశారు. అనంతరం మరో ఫ్లాట్ లోకి చొరబడ్డ చోరులు.. ఆ ఇంటిని కూడా క్షుణ్ణంగా జల్లెడపట్టారు. కానీ అక్కడ ఏమీ దొరకకపోవడంతో గ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి దుస్తులు, వస్తువులకు నిప్పుపెట్టి పరారయ్యారు. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫ్లాట్ యజమాని ఈశ్వర్ ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.