అగర్వాల్‌ హత్య కేసులో పురోగతి | Progress In Agarwals Murder Case | Sakshi
Sakshi News home page

అగర్వాల్‌ హత్య కేసులో పురోగతి

Published Tue, Aug 21 2018 11:52 AM | Last Updated on Tue, Aug 21 2018 1:33 PM

Progress In Agarwals Murder Case - Sakshi

ఘటనాస్థలంలో అగర్వాల్‌ బంధువులు

హైదరాబాద్‌: రాజేంద్ర ప్రసాద్‌ అగర్వాల్‌ హత్య కేసులో పురోగతి లభించింది. అగర్వాల్‌ దగ్గర పని చేసిన ఆరుగురు డ్రైవర్లలో ఓ డ్రైవరే ఈ హత్య చేసి దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పట్నాకు పంపించామని పోలీసులు తెలిపారు. గత గురువారం రాత్రి రాజేంద్రనగర్‌ పరిధి తిరుమలనగర్‌లోని ఓ ఇంట్లో దోపిడీ జరిగింది.

ఇంటి యాజమాని రాజేంద్ర ప్రసాద్‌ అగర్వాల్‌, ఆయన భార్యపై దాడి చేసి 40 తులాల బంగారాన్ని, 50 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. ఈ దాడిలో అగర్వాల్‌ ప్రాణాలు కోల్పోగా..ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దోపిడీలో డ్రైవర్‌తో పాటు మరికొందరు పాల్గొని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement