కూలిన భారీ గోడ.. తప్పిన ప్రమాదం
Published Fri, Sep 16 2016 3:43 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
హైదరాబాద్: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ క్రమంలో నగర శివారులోని రాజేంద్రనగర్ నేతాజీనగర్‌లో సుషీల్ కంటెయినర్ ప్లాస్టిక్ కంపనీ ప్రహరి గోడ కూలింది. ఆ సమయంలో గోడ పక్కన నిలిపి ఉంచిన ఓ ఆటోతో పాటు రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, పలు విద్యుత్‌స్తంభాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఆయా కాలనీలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోడ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Advertisement
Advertisement