తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ | free training of apiculture | Sakshi
Sakshi News home page

తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ

Published Tue, Jan 14 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

free training of apiculture

 హసన్‌పర్తి, న్యూస్‌లైన్ :  తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంపై హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డెరైక్టర్ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తొమ్మిది రోజులపాటు ఉంటాయని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారు శిక్షణ పొందేందుకు అర్హులని, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని వివరించారు.

ఆసక్తి గలవారు బయోడేటా, నాలుగు పాస్‌ఫొటోలు, రేషన్‌కార్డు జిరాక్స్‌తో హసన్‌పర్తిలోని సంస్క­ృతీ విహార్‌లో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0870-2564766, 98493 07873 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement