దేవాలయాలనే టార్గేట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజేంద్రనగర్: దేవాలయాలనే టార్గేట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నగరంలోని నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రఘురాంనగర్ కాలనీ, సీతారాములు దేవాలయం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ఎల్లప్ప(30) శుక్రవారం అర్ధరాత్రి సీతారాముల ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులోని సొమ్ముతో పాటు ఆలయంలోని ఇతర సామాగ్రిని మూట కట్టుకొని పారిపోవడానికి సిద్ధమయ్యాడు.
హుండీ పగలకొట్టినప్పుడు చప్పుడు కావడంతో ఆలయం సమీపంలో ఉన్నవాళ్లు దొంగ ప్రవేశించాడనే విషయాన్ని గమనించి ఆలయం వద్దకు వచ్చారు. ఇది గమనించిన దొంగ ఆలయం వెనక భాగంలో ఉన్న స్టోర్‌రూమ్‌లో దాక్కున్నాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా గతంలో కూడా ఎల్లప్ప పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.