హైదరాబాద్: ఉద్యోగుల సొమ్మును తన ఖాతాలో వేసుకుని అక్రమాలకు పాల్పడిన రాజేంద్రనగర్ ఎస్టాబ్లిష్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఉద్యోగులకు చెందిన జీతాల డబ్బు రూ.1.3 కోట్లను సీనియర్ అసిస్టెంట్ అరవిందరాజు తన ఖాతాలో వేసుకుని భారీ అక్రమాలకు తెరలేపాడు. ఉద్యోగుల పీఎఫ్, ఎల్‌ఐసీ కట్టకుండా గత కొన్ని నెలలుగా మోసాలకు పాల్పుడుతున్నాడు.
డిప్యూటీ కమిషనర్ విజయలక్ష్మి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసులకు భయపడ్డ అరవిందరాజు రెండ్రోజుల క్రితం కోర్టులో లొంగిపోయాడు. మోసపోయిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు నిందితుడి వద్ద ఉన్న నగదు వివరాలపై విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.