ఎట్టకేలకు కొత్త రెవెన్యూ డివిజన్లకు పోస్టులు మంజూరయ్యాయి. ఒక్కో డివిజన్‌కు 32 చొప్పున 64 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి డివిజన్లకు ఆర్డీఓలుగా ఇద్దరు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లను నియమించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎట్టకేలకు కొత్త రెవెన్యూ డివిజన్లకు పోస్టులు మంజూరయ్యాయి. ఒక్కో డివిజన్‌కు 32 చొప్పున 64 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి డివిజన్లకు ఆర్డీఓలుగా ఇద్దరు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. అదేవిధంగా పరిపాలనాధికారి, ఉప తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, అటెండర్ తదితర పోస్టులు వివరిస్తూ వేతన వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొంది. గత మూడు నెలల క్రితం హడావుడిగా రెవెన్యూ డివిజన్ల ప్రక్రియను పూర్తి చేసిన సర్కారు.. ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల అంశాన్ని మాత్రం పక్కనపెట్టింది. ప్రభుత్వం ఉత్తర్వుల వెలువ ర్చిన నాటి నుంచే ఈ డివిజన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. సిబ్బంది లేకపోవడంతో ఆయా కార్యాలయాల్లో వ్యవహారాలు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఆర్డీఓలే పరిశీలించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడంతో జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ గత నెల మొదటివారంలో హడావుడిగా ఇద్దరు డిప్యూటికలెక్టర్లను కొత్త రెవెన్యూ డివిజన్లకు ఇన్‌చార్జీ ఆర్డీఓలుగా నియమించారు. అయితే వారు కేవలం అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియతో మమ అనిపించారు. తాజాగా కొత్తగా పోస్టులు ఖరారు చేసిన ప్రభుత్వం.. వాటి భర్తీపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ అయిన తర్వాతే ఆయా డివిజన్లలో పాలన ప్రక్రియ మొదలవుతుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.