HYD: న్యూ ఇయర్‌ వేడుకలు.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో ‍డ్రగ్స్‌ స్వాధీనం! | Drugs Seized In Software Employee Sandhya House In Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: న్యూ ఇయర్‌ వేడుకలు.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో ‍డ్రగ్స్‌ స్వాధీనం!

Published Sun, Dec 31 2023 6:12 PM | Last Updated on Sun, Dec 31 2023 6:19 PM

Drugs Seized In Software Employee Sandhya House In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో డ్రగ్స్‌ కలకలం చోటుచేసుకుంది. న్యూ ఇయర్‌ సందర్భంగా పార్టీ కోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని వెనుక ఎవరు? ఉన్నారని ఆరా తీస్తున్నట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను బాలానగర్‌, రాజేంద్ర నగర్‌లో ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. శివరాంపల్లిలోని పిల్లర్ నెంబర్ 290 వద్ద ఉన్న ప్రోవిడెంట్ కేన్వర్త్ అపార్ట్మెంట్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే 7.5 గ్రాముల డ్రగ్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగా, ఓ విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులతో సంయుక్తంగా కలిసి దాడి నిర్వహించారు.

ఈ క్రమంలో సంధ్య (26)దగ్గర డ్రగ్స్ ఉండగా, అది తీసుకోవడానికి వచ్చిన అర్జున్ (25), డేవిడ్‌ను ట్రాప్ చేసి ముగ్గురిని ఒకే సారి పట్టుకున్నారు. పది గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీని వెనుక ఎవ్వరూ ఉన్నారు?. డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? అనేది దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అర్జున్‌ తీసుకువచ్చినట్టు గుర్తించారు. 

జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్‌..
అంతకుముందు కూడా న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్‌ కోసం ప్రత్యేక పరికరాలు 
న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్‌ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement