
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: హైదర్ గూడా పరిధి నలందానగర్లోని ఓ ఇంట్లో పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు. నాగేశ్వరరావు అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 20 తులాల బంగారంతో పాటు రెండు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి వెనుక డోర్ పగలగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి సభ్యులు ఓ శుభకార్యానికి బయలుదేరిన కొద్ది సేపటికే దొంగలు తమ చేతులకు పనిచెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment