
సాక్షి, రంగారెడ్డి: నగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కొందరు దుండగులు ఓ మహిళను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment