
విలేకరులతో మాట్లాడుతున్న ప్రకాష్‌గౌడ్
రాజేంద్రనగర్: హ్యాట్రిక్ విజయం అందించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలేత్తిన తీర్చుకోలేనని టి.ప్రకాష్‌గౌడ్ వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రజా సేవ చేసేందుకు ప్రజల్లోకి వచ్చానని అందుకు వారు తనను ఆహ్వానించారన్నారు.ప్రతిసారి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నారని వారి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. మహిళలు, యువతీయువకులు అందరు కలిసి తనను గెలిపించారన్నారు. గత రెండుసార్లు ప్రతిపక్షంలో ఉండి విజయం సాధించానని ఇప్పుడు అధికార పక్షంగా మరోసారి గెలిపించారన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రజా సమస్యలన్చు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానన్నారు. తనవెంట నిలిచిన నాయకులు, కార్యకర్తలందరికి న్యాయం చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. గత నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి పూర్తిస్థాయిలో నిర్వహించలేదన్నారు. మరోసారి అవకాశం ఇచ్చారని ఈ ఐదు సంవత్సరాలలో పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ సందర్భంగా తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
పతంగికి నియోజకవర్గంలో స్థానం లేదు..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీకి స్థానం లేదు. మూడు సార్లు పోటీ చేసి కనిపించకుండా పోయింది. ప్రత్యర్థులు ఎన్నో కుట్రలు పన్నిన ప్రజలు మాత్రం ఆదర్శించారన్నారు. మైనార్టీలు మరోసారి నావెంటే ఉన్నారని స్పష్టమైందన్నారు. వారికి అందుబాటులో ఉండి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment