నేడు సీఎం రేవంత్ సమక్షంలో చేరనున్న ప్రకాశ్‌గౌడ్, అరికపూడి గాంధీ
ఈ నెల 7న హైదరాబాద్‌లో చంద్రబాబును కలసిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు
పలువురు మున్సిపల్ చైర్మన్లు కూడా హస్తం పార్టీలోకి..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ నగర పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) శుక్రవారం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
వారితోపాటు కొందరు మున్సిపల్ చైర్మన్లు కూడా తమ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు బీఆర్‌ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యే లు కాంగ్రెస్‌లో చేరగా.. ఈ ఇద్దరి చేరిక పూర్తయితే ఆ సంఖ్య తొమ్మిదికి చేరనుంది.
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాతే..
ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ ఇద్దరూ 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి.. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ బీఆర్ ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నిక య్యారు. నిజానికి ఈ ఇద్దరు నేతలు కూడా టీడీపీలో కొన సాగినకాలంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ టీడీపీ ఉనికి కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు.
మరోవైపు ఇటీవల ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తాజాగా హైదరాబాద్‌కు వచ్చారు. ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ ఈ నెల ఏడున చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. తర్వాత వారం రోజుల లోపలే వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆదేశాల మేరకే వారు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment