నేడు హస్తం గూటికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయిన ప్రకాశ్‌గౌడ్!
బీజేపీ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, కేటీఆర్ సమీప బంధువు ఎడ్ల రాహుల్‌రావు చేరిక
మరో నలుగురైదుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా రెడీ
కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ అంటున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికలు మళ్లీ మొదలవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆయన కలిశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన సీఎంను కలిశారు. ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని, శనివారం తన అనుచరులతో కలిసి ఆయన అధికారికంగా పార్టీ లో చేరతారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు బీజేపీ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచి్చన ఆయనకు రేవంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. అలాగే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీప బంధువు ఎడ్ల రాహుల్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల సమక్షంలో ఆయనకు రేవంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పారు.
ఎన్నికల క్లైమాక్స్‌లో..: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తనకు టచ్‌లోకి వచ్చారంటూ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన మరుసటిరోజే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చే రేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీలోకి చే ర్చుకోవాలనే భావనతో సీఎం రేవంత్ ఉన్నారని, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారనే కోణంలో కేసీఆర్ మాట్లాడిన నేపథ్యంలోనే.. ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆయన పదును పెట్టారని గాం«దీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో జీ హెచ్‌ఎంసీకి చెందిన మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని, లోక్‌సభ ఎన్నికలకు ముందే వారు పార్టీలోకి చేరతారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఓ మాజీ మంత్రి కూడా ఈ జాబితాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్‌కు వైరా మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై
వైరా: ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రా ములు నాయక్ శుక్రవారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చే శారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ పంపించారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయ న ఆనాటి బీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌లాల్‌పై విజయం సాధించారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరగా, గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆయనకు కాకుండా మళ్లీ మదన్‌లాల్‌కే టికెట్ కేటాయించింది. మదన్‌లాల్ ఓడిపోయినా.. వైరా ఇన్‌చార్జిగా ఆయననే ని యమించడంతో పార్టీలో తనకు సరైన గౌరవం లభించడం లేదని రాములు నాయ క్ సన్నిహితుల వద్ద వాపోయారు. ఈ నేపథ్యంలో ఎంపీలు వద్దిరాజు, నామా తదితరులు రాములు నాయక్ ఇంటికి వెళ్లి తగిన గుర్తింపు లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాగా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment