సాక్షి, హైదరాబాద్/మణికొండ: బీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఆదివారం ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహి ల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దీనితో ప్రకాశ్‌గౌడ్ బీఆర్‌ఎస్‌ను వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిని ప్రకాశ్‌గౌడ్ ఖండించారు.
మర్యాదపూర్వకంగానే కలిశా: ప్రకాశ్‌గౌడ్
తాను మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యానని ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. తాను ప్రాతి నిధ్యం వహిస్తున్న రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ, బహ దూర్‌గూడ, ఘాన్సిమియాగూడ గ్రామాల్లో భూసంబంధ సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలి శానని ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ అభి వృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తాను కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment