
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్‌పై హిమాయత్‌సాగర్ వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.
అత్యాచారం అనంతరం తిరిగి బాధిత యువతిని నిందితుడు ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. అయితే తనపై జరిగిన అత్యాచార ఘటన గూర్చి ఇంట్లో ఉన్న తల్లితో బాధితురాలు చెప్పుకుంది. దీంతో వెంటనే తల్లి, బాధితురాలుతో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకునిపై అత్యాచార కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment