రాజేంద్రనగర్ : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీ డ్రైనేజీ పైపులైన్ నుంచి కుల్లిపోయిన శవం ఒకటి కోట్టుకువచ్చింది. దీంతో స్థానికులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మూడు వారాల క్రితమే చనిపోయి ఉండవచ్చని బావిస్తున్నారు. మృతుని తల, మోండం రెండు భాగాలుగా విడిపోయింది.
పైపులైన్ నుంచి 10 మీటర్ల దూరంలో తల పుర్రె ఉండగా మోండం కింది భాగం కుల్లిపోయిన స్థితిలో పైపు నుంచి బయటకు వెళ్ళింది. పై భాగం పూర్తిగా కుల్లిపోయి ఆనవాలు లేకుండా మారింది. పంచనామా నిర్వహించిన ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు వారాల కిత్రమే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని ఏదైనా ప్రాంతంలో డ్రైనేజీలో వేయడంతో కోట్టుకు వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు.
చుట్టు పక్కల ప్రాంతాలలో మిస్సింగ్ కేసుల విషయమై పరిశీలించనున్నట్లు తెలిపారు. మృతదేహం మగవారిదా, ఆడవారిదా అన్నది గుర్తించలేకపోతున్నామాన్నరు. పోరెన్సీ ల్యాబ్‌కు పంపించి పూర్తి వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. కాగా ఎక్కడో హత్య చేసి ఈ ప్రాంతంలోని డ్రైనేజీలో వేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ పైపులైన్ గూండా శవం దొరికిందని తెలియడంతో స్థానికుల పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల మొండెం వేర్వేరుగా...
Published Wed, May 31 2017 10:55 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM
Advertisement
Advertisement