నగరంలోని రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి చౌరస్తాలో ఓ జేసీబీ వాహనం శుక్రవారం ఉదయం విధ్వంసం సృష్టించింది.
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి చౌరస్తాలో ఓ జేసీబీ వాహనం శుక్రవారం ఉదయం విధ్వంసం సృష్టించింది. ఆరాంఘర్ వైపు వెళుతున్న జేసీబీ, బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందు వెళుతున్న ఆటో, బైక్ తో పాటు పాదచారులపై దూసుకెళ్లింది.
ఈ ఘటనలో మహేందర్ (30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్తానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్థానికంగా ఓ ప్లాస్టిక్ కంపెనీ ఉద్యోగి అని తెలిసింది.