హైదరాబాద్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడలో మంగళవారం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో పలు బిస్కెట్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జయ ఫుడ్స్ కంపెనీలో పనిచేస్తున్న 22 మంది బాల బాలికలను వారు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలలను తమ వెంట తీసుకెళ్లారు.