డిపో ముందు ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం | RTC driver commits suicide at Depot | Sakshi
Sakshi News home page

Published Fri, May 1 2015 10:42 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

కార్మికులకు పండగరోజు లాంటి మేడే రోజే ఓ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో ముందు శుక్రవారం ఉదయం జరిగింది. డిపో పరిధిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజ్ కుమార్(40) అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు అతన్ని రక్షించారు. ఆర్టీసీ సీఐ కృష్షారెడ్డి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు డ్రైవర్ ఆరోపిస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement