సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు ఆడుకుంటూ మృతి చెందాడు. జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిశాంత్ శర్మ సిమెంట్ బెంచ్‌పై ఆడుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా కిందపడిపోయాడు.. సిమెంట్ బెంచ్ ఆ బాలుడిపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విరిగిపోయిన కుర్చీ ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. పార్క్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే.. బాలుడు మరణించినట్టు అపార్ట్‌మెంట్‌వాసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment