
సాయి ( ఫైల్ ఫోటో)
రాజేంద్రనగర్: ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పర్‌పల్లి ప్రాంతానికి చెందిన సాయి(24) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సాయి ప్రేమించిన యువతికి ఆదివారం వివాహం జరిగిందని అప్పటి నుంచి తమ వద్ద విషయాన్ని తెలుపుతూ బాధపడుతున్నాడని స్నేహితులు తెలిపారు. ఇదే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చునని స్నేహితులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.