
కారుతో మైనర్ల బీభత్సం..
హైదరాబాద్: రాజేంద్రనగర్ రోడ్లపై మైనర్లు ర్యాష్ డ్రైవింగ్‌తో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందడంతో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి కారుతో రొడ్డెక్కారు. తమ ఇష్టం వచ్చినట్లు కారు నడపడంతో వాహనంలో ఇళ్లల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మైనర్లు వెళ్తున్న కారును వెంబడించి పట్టుకున్నారు. ఓ అబ్బాయి సహా ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.