minors arrested
-
దారుణం: సోదరిపై వేధింపులను ప్రశ్నించాడని కత్తులతో పొడిచి చంపేశారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సోదరిపై వేధింపులకు పాల్పడటాన్ని ప్రశ్నించినందుకు ఓ 17 ఏళ్ల బాలుడిని దారుణంగా పొడించి చంపేశారు ఇద్దరు మైనర్లు. శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధితుడు పటేల్ నగర్‌కు చెందిన బాలుడిగా గుర్తించారు. వీడియో ప్రకారం.. ఓ గల్లీలో ముగ్గురు మైనర్లు గొడవ పడుతున్నారు. అందులో ఒకడు బాధితుడిని కత్తితో పలు మార్లు పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. శరీరంలో దిగిన కత్తితో బాధితుడు పడిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాణాలు కోల్పోయే ముందు తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసేందుకు ప్రయత్నించినట్ల తెలుస్తోంది. కంప్యూటర్ క్లాస్‌కు వెళ్లి తిరిగి వచ్చిన క్రమంలో ఇంటివద్దే దాడి చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితులైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. #Video: #Delhi Teen Stabbed To #Death After He Protested Sister's #Harassment. @DelhiPolice #PatelNagar #viral #murder #CCTV #news #UnMuteIndia #crime Subscribe to our YouTube page: https://t.co/EKkVQVGoS5 pic.twitter.com/sz4Q5XU8jD — UnMuteINDIA (@LetsUnMuteIndia) October 29, 2022 ఇదీ చదవండి: ఎంత ఘాటు ప్రేమయో.. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్టూడెంట్స్.. చివరకు.. -
అంతా 12 ఏళ్ల లోపువారే.. స్నేహితుడిపైనే దారుణంగా..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సీలాంపుర్ ప్రాంతంలో ముగ్గురు బాలురు తన స్నేహితుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బాధిత 10 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు వెల్లడించేందుకు తొలుత కుటుంబ సభ్యులు నిరాకరించగా.. పోలీసుల కౌన్సిలింగ్‌తో జరిగిన దారుణాన్ని వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 18న బాధిత బాలుడిపై ముగ్గురు మైనర్ స్నేహితులు లైంగికంగా వేధించారు. దాడి జరిగిన మూడు రోజులకు బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా బాలుడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లి వివరించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడు కొన్ని రోజులు చికిత్సకు స్పందించినా.. శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఇద్దరు జువైనల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, తల్లిదండ్రుల హామీతో వారిని విడుదల చేయాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. మరో బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పోక్సో, ఐపీసీ సెక్షన్ 377,34 ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన మైనర్లు సైతం 10-12 ఏళ్ల వారేనని వెల్లడించారు. ఇదీ చదవండి: వైద్యులు బతకడన్నారు.. ఇప్పుడు 18వ బర్త్‌డే చేసుకుంటున్నాడు! -
Anantapur: ఈ మైనర్లు మహాముదుర్లు!
అనంతపురం క్రైం: వ్యసనాలకు బానిసలై జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించడానికి చోరీల బాట పట్టిన నలుగురు మైనర్లను ఇటుకలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని జువైనల్ జస్టిస్(జేజే) బోర్డు ముందు హాజరుపరిచారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వీరరాఘవరెడ్డి కేసు పూర్వాపరాలు వెల్లడించారు. 2019 నుంచి రాప్తాడు, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పలు చోరీలు జరిగాయి. వీటిపై దృష్టి సారించాలని ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు శ్రీకాంత్, ఆంజనేయులు ప్రత్యేక నిఘా ఉంచారు. పక్కా సమాచారంతో మంగళవారం రాప్తాడు సమీపంలోని డాల్ఫిన్ రెస్టారెంట్ వద్ద నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా... చోరీల గురించి పూర్తి వివరాలు తెలిశాయి. జల్సాల కోసమే ఇళ్లలో చోరీలు చేశామని, 2019 నుంచి ఇప్పటి వరకు 9 చోరీలు చేసినట్లు వారు అంగీకరించారు. దీంతో పోలీసులు వారి నుంచి 21 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని జేజే బోర్డు ముందు హాజరుపర్చి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించినట్లు డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. సమావేశంలో సీఐ విజయ్‌భాస్కర్‌గౌడ్, ఎస్ఐలు ఆంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పసిబిడ్డల ఉసురు తీసిన బాబాయి -
బాలలే హుండీ దొంగలు!
భీమవరం టౌన్/ఉండి : జిల్లాలోని ఉండి మండలం చిలుకూరు గ్రామం పైలమ్మ అమ్మవారి గుడి హుండీ పగులగొట్టి నగదు చోరీ చేసిన కేసును నాలుగు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. గుడి వద్ద సీసీ కెమెరా ఫుటేజీ దర్యాప్తు వేగవంతానికి దోహదపడింది. నలుగురు మైనర్లు మోటారు సైకిళ్లపై వచ్చి చోరీకి పాల్పడ్డారు. వీరిలో ఒక బాలిక కూడా ఉండటం విశేషం. వీరంతా బాల నేరస్తులే. భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున చోరీ జరిగినట్టు గుడి కమిటీ సభ్యుడు రుద్రరాజు శివ ఫిర్యాదు చేశారు. భీమవరం రూరల్ సీఐ ఎం.శ్యామ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉండి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఎస్సై అప్పలరాజుకు అందిన సమాచారం మేరకు కానిస్టేబుళ్లు ఎన్.గోపి, పి.నాని బాబుతో కలిసి బుధవారం ఉండి మెయిన్ సెంటర్లో ఇద్దరు బాల నేరస్తులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి చోరీ సొత్తు రూ.8 వేలు రికవరీ చేసి విచారించగా మరో ఇద్దరు బాల నేరస్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి రాత్రి వేళల్లో భీమవరం పరిసర గ్రామాల్లోని గుళ్లలో హుండీల సొత్తు చోరీ చేసి జల్సా చేస్తున్నారు. వీరిపై గతంలో భీమవరం వన్‌టౌన్, ఆకివీడు, వీరవాసరం, గుడివాడ వన్ టౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. దొరికిన ఇద్దరూ మైనర్లు కావడంతో ఏలూరు జువైనల్ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఉండి ఎస్సై అప్పలరాజును, ఇరువురు కానిస్టేబుళ్లను ఎస్పీ నారాయణ నాయక్ అభినందించారు. -
బెజవాడలో తొట్టి గ్యాంగ్ గుట్టు రట్టు...
సాక్షి, విజయవాడ: అర్ధరాత్రి వాహనాలను దగ్ధం చేసి జనం గుండెల్లో దడ పుట్టించిన తొట్టి గ్యాంగ్ గుట్టు రట్టయింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఉదంతం జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించారు. ఇందుకు సంబంధించి .ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. సత్యనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు చోట్ల వాహనాలపై పెట్రోల్ పోసి దగ్ధం చేసిన చేసిన విషయం తెలిసిందే. నిందితులను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ విజయరావు మాట్లాడుతూ.. పార్క్ చేసి ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి దగ్ధం చేసిన కేసులో రాజరాజేశ్వరి పేటకు చెందిన సంజయ్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన గుమ్మడి సంజయ్‌కు చదువు అబ్బలేదు. అడిగేవారు లేకపోవటంతో చెడు దారి పట్టి వ్యసనాలకు బానిస అయ్యాడు. నిత్యం ఇద్దరు బాలురితో కలిసి మద్యం మత్తులో జోగి తప్పతాగి తిరిగే వాడు. అయితే మత్తులో ఉన్న కారణంగా వారు ఈ నేరానికి పాల్పడ్డారని డీసీపీ స్పష్టం చేశారు. తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవటం వల్లే మద్యానికి బానిసలై నేర ప్రవృత్తి వైపు మళ్లారని డీసీపీ అన్నారు. విజయవాడలో నేరాల అదుపుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసామని ఈ సందర్బంగా పేర్కొన్నారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడినా, ఆకతాయి పనులు చేసినా కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు. -
చదువుతూనే గంజాయి దందా..
సాక్షి, పెద్దపల్లి : ఓ యువకుడు డిప్లొమా ఫైనల్ ఇయర్.. మరొకరు ఇంటర్.. ఇంకొకరు ఇంటర్ పూర్తిచేసి డిగ్రీలో చేరాడు. ఈ ముగ్గురు కలిసి గంజాయి దందా చేస్తూ గురువారం పెద్దపల్లి పోలీసులకు చిక్కారు. గోదావరిఖనికి చెందిన ముగ్గురు స్నేహితులు కలిసి చేస్తున్న దందా చూసి పోలీస్ అధికారులు నివ్వెరపోయారు. డీసీపీ సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోండం ప్రదీప్‌రెడ్డి(19), బత్తుల శివకుమార్(19), మరో మైనర్.. ముగ్గురు కలిసి కొంతకాలంగా గంజాయి కొనుగోలు చేసి తోటి స్నేహితులకు విక్రయిస్తున్నారు. ఈ విషయం కనిపెట్టిన పెద్దపల్లి ఎస్సై ఉపేందర్‌రావు పెద్దకల్వల స్టేజీ వద్ద ముగ్గురు యువకులను సోదా చేయగా మూడు పాలిథిన్ కవర్లలో 750గ్రా. గంజాయి లభించింది. ముగ్గురు విద్యార్థులే కావడంతో ఎవరికీ అనుమానం కలగలేదని, కొంతకాలంగా వారు చేస్తున్న దందా పోలీసుల దృష్టికి రావడంతో నిఘా ఏర్పాటు చేసి పట్టుకున్నారు. గోదావరిఖనితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆ ముగ్గురి నుంచి గంజాయి కొనుగోళ్లు చేసినవారితో పాటు వ్యాపారానికి సంబంధాలు ఉన్నవారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి, సీఐ నరేందర్, ఎస్సై ఉపేందర్ పాల్గొన్నారు. పిల్లలను కాపాడుకోవాల్సింది తల్లిదండ్రులే.. కళాశాలలకు వెళ్తున్న పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం తల్లిదండ్రులు గమనించకపోతే చేజారిపోయే ప్రమాదముందని డీసీపీ సుదర్శన్‌గౌడ్ హెచ్చరించారు. పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారని, దీంతో వారి జీవితం పూర్తిగా దుర్భరమవుతుందన్నారు. సకాలంలో ఇంటికి వస్తున్నారా లేదా అనేది గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందన్నారు. సింగరేణి కోల్‌బెల్టు ప్రాంతంలో ఇలాంటి దారి తప్పిన పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ఆందోళన చెందారు. మాదకద్రవ్యాల కేసులో అరెస్టైన వారికి కోర్టు 20ఏళ్ల జైలుశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. గంజాయి అమ్మకం వ్యాపారంలో పోలీసులకు చిక్కినవారిపై పిడీయాక్టు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులే పిల్లలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. -
ఆ... ఆరుగురు మహా ముదుర్లు..!
సాక్షి, హిమాయత్‌నగర్: వృత్తిరిత్యా కూలిపనులు చేసుకునే ఆరుగురు యువకులు చోరీలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. జల్సాల కోసం ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ద్విచక్రవాహానాలు దొంగిలిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఆరుగురిలో ఇద్దరు మేజర్లు కాగా..నలుగురు మైనర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు జైలుకు వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోలేదు. తాజాగా నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడి నుంచి సెల్‌ఫోన్, నగదు దోపిడీ చేసి సీసీపుటేజీ ఆధారంగా కొన్ని గంటల్లోనే పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన అనూజ్‌ప్రసాద్ హైటెక్‌సిటీలో క్యాటరింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ నెల 26 రాత్రి అతను లిబర్టీ సిగ్నల్ నుంచి నారాయణగూడ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఉన్న బస్టాప్‌కు వచ్చాడు. అయితే హైటెక్ సిటీకి వెళ్లేందుకు బస్సులేకపోవడంతో బస్టాప్‌లోనే పడుకున్నాడు. అర్థరాత్రి రాంనగర్ ఫిష్‌మార్కెట్ ప్రాంతానికి చెందిన చంద్రకాంత్, మధు, సోహల్, గౌతమ్, రంజిత్, షరీఫ్ రెండు బైక్‌లపై వచ్చి అనూజ్‌ప్రసాద్‌ను బెదిరించి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, పర్సు, రూ.150 నగదు లాక్కుని పరారయ్యారు. వీరిలో చంద్రకాంత్, మధు మేజర్లు కాగా, మిగతా నలుగురూ మైనర్లు కావడం గమనార్హం. మరుసటి రోజు బాధితుడు అనూజ్‌ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ద్వారా గుర్తింపు.. సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు సెల్‌ఫోన్ చోరీ అనంతరం నిందితులు రాంనగర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. రాంనగర్ ఫిష్‌మార్కెట్ వద్ద స్థానికులను విచారించగా నిందితులపై కీలక సమాచారం అదించారు. దీంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. షరీఫ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అందరికీ నేరరచరిత్ర.. పోలీసు స్టేషన్లో పోలీసులు నిందితులను విచారించగా పలు చోరీలు వెలుగులోకి వచ్చాయి. సోహల్, చంద్రకాంత్, మధు నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. చంద్రకాంత్ ఉప్పల్ పీఎస్ పరిధిలో ల్యాప్‌టాప్‌లు దొంగిలించి రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చా డు. మధు చిక్కడపల్లి, నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలో బైక్, ల్యాప్‌టాప్ చోరీ కేసులో పోలీసులకు పట్టుబడటంతో రెండు సార్లు జైలుకు వెళ్లాడు. సోహాల్ గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో నగదు, సెల్ఫోన్లు చోరీ చేసి జైలుకు వెళ్లాడు. గంజాయి కోసమే.. గంజాయికి అలవాటు పడిన వీరు డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మధు కార్‌వాషింగ్‌లో పనిచేస్తుండగా.. సోహల్ మటన్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. వీరు మిగతా నలుగురితో కలిసి గంజాయి తాగేవారు. గంజాయి కొనేందుకు చోరీలకు పాల్పడుతున్నట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. -
కామాంధుల అరెస్టు
ఒంగోలు/ సాక్షి, అమరావతి: బాలికపై సామూహిక లైంగిక దాడి కేసును ఒంగోలు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. తల్లి మందలించిందని ఇల్లు విడిచి ఒంగోలు చేరుకున్న బాలికను ఆరుగురు యువకులు మభ్యపెట్టి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు ఘటన వివరాలు వెల్లడించారు. నమ్మించి నయవంచన గుంటూరు జిల్లా నల్లచెరువుకు చెందిన బాలిక ఈ ఏడాది మేలో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తాతయ్యకు సాయంగా ఉండేందుకు వెళ్లింది. అదే సమయంలో ఒంగోలులో కారు డ్రైవర్‌గా పనిచేసే అమ్మిశెట్టి రాము అదే ఆసుపత్రికి ఓ పేషెంట్‌ను తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. పరస్పరం ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి జూన్ 15న కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక రాముకు ఫోన్ చేసి, తాను ఒంగోలుకు వస్తున్నట్లు చెప్పింది. 16వ తేదీ రాత్రి 7 గంటలకు ఒంగోలు బస్టాండ్‌కు చేరుకుంది. రామును కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. బస్టాండ్‌లో కేఆర్ మొబైల్స్ దుకాణంలో పనిచేసే రెండు చేతులు లేని దివ్యాంగుడైన షేక్ బాజీని రాముకు కాల్ చేసేందుకు ఫోన్ ఇవ్వమని అభ్యర్థించింది. షేక్ బాజీ ఫోన్ ఇచ్చినట్లే ఇచ్చి బాలికను మొబైల్స్ దుకాణం వెనుక భాగంలో ఉన్న సర్వీసింగ్ రూమ్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 17వ తేదీ అర్ధరాత్రి బాజీ, అతడి స్నేహితులైన ఆవుల శ్రీకాంత్‌రెడ్డి, మరో మైనర్ బాలుడు షాపులోకి వచ్చి బాలికతో మాట కలిపారు. రాము వద్దకు తీసుకెళతామని నమ్మబలికి ఓ గదిలోకి తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బయటకు రాకుండా గదిలోనే నిర్బంధించారు. 19వ తేదీన బాజీ, శ్రీకాంత్‌రెడ్డి, మైనర్ బాలుడు బయటకు వెళ్లిపోయారు. తర్వాత మహేష్ అనే వ్యక్తి, మరో ఇద్దరు మైనర్లు వచ్చి బాధితురాలిపై లైంగిక దాడికి దిగారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు బాలికపై ఈ అరాచకం కొనసాగించారు. 22న తెల్లవారుజామున 3 గంటల సమయంలో మైనర్లలో ఒకడు ఆమెను ఒంగోలు బస్టాండ్ వద్దకు తీసుకొచ్చి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయాడు. బస్టాండ్ ఆవరణలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ సంచరిస్తున్న బాధితురాలిని గమనించిన హోంగార్డు వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సీతారామయ్య దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే శక్తి టీమ్‌ను అప్రమత్తం చేసి, బాలిక నుంచి విషయం రాబట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించారు. మైనర్లపై జువైనల్ చట్టం ప్రకారం చర్యలు బాలికపై లైంగిక దాడి కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని, వారిలో ముగ్గురు మైనర్లు అని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్పారు. మైనర్లపై జువైనల్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మేజర్లయిన మైనంపాడుకు చెందిన ప్రధాన నిందితుడు షేక్ బాజీ, యం.నిడమానూరుకు చెందిన రెండో నిందితుడు రావుల శ్రీకాంత్‌రెడ్డి, ఆరో నిందితుడైన మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లికి చెందిన పాత్ర మహేష్‌లను అరెస్టు చేశామన్నారు. బాలిక అదృశ్యమైనట్లు గుంటూరు లాలాపేట పోలీసుస్టేషన్లో ఈ నెల 19న కేసు నమోదైనట్లు వెల్లడించారు. నిందితులపై ‘పోస్కో’ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా, నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని డీజీపీ గౌతం సవాంగ్ ఓ ప్రకటనలో తెలిపారు. బాధితురాలికి మంత్రి బాలినేని పరామర్శ అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌తో మాట్లాడారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యాచార ఘటన గురించి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు వివరాలు తెలియజేశారు. -
దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసై దొంగలుగా మారారు. పది మంది ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి వేళల్లో నగరంలో తిరుగుతూ ఒంటరిగా వెళ్లే వారిపై దాడిచేసి నగదు, సెల్ఫోన్లు దోపిడీ చేసి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన రెండో నగర పోలీసులు సోమవారం నిందితులను తూర్పు రైల్వేక్వార్టర్ సమీపంలో అరెస్ట్ చేశారు. స్థానిక రెండో నగర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. బోగోలు మండలం చెంచులక్ష్మీపురానికి చెందిన రాకేష్, పొగతోటకు చెందిన నాగరాజు, కిసాన్‌నగర్, బాలాజీనగర్, బీవీనగర్, పొదలకూరురోడ్డు, కోటమిట్ట, సంతపేట, బోడిగాడితోట, ఎన్టీఆర్నగర్ తదితర ప్రాంతాలకు చెందిన మరో ఎనిమిది మంది బాలలు చిన్నతనం నుంచే చెడు (మద్యం, వ్యభిచారం) వ్యసనాలకు బానిసయ్యారు. అందరూ ముఠాగా ఏర్పడి తొలుత చిల్లర దొంగతనాలు చేశారు. వ్యసనాలకు డబ్బులు చాలకపోవడంతో రాత్రి వేళల్లో బైక్‌లపై తిరుగుతూ రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు, ఇళ్లకు వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడి చేసేవారు. వారి వద్ద నుంచి విలువైన సెల్ఫోన్లు, నగదు దోపిడీ చేసి విలాసంగా జీవిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు అధికం కావడంతో రెండో నగర పోలీసులు నిఘా ఉంచారు. సోమవారం నిందితులు తూర్పు రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఉన్నారన్న సమాచారం రెండో నగర ఇన్స్పెక్టర్ వెంకటరావుకు అందింది. దీంతో ఆయన ఎస్సై వి. శ్రీహరి, క్రైం ఏఎస్సై రాజేశ్వరరావు, సిబ్బంది భాస్కర్, చెంచయ్య తదితరులతో కలిసి అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు రెండు, ఆరో నగర పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో రాకేష్, నాగరాజును అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.4 లక్షలు విలువ చేసే ఏడు ద్విచక్ర వాహనాలు, రూ.6,200 నగదు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఎనిమిది మంది బాలలు కావడంతో వారిని జువైనల్çహోమ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
మైనర్లకు ట్రాఫిక్ పోలీసుల కౌన్సెలింగ్
సిద్దిపేటటౌన్: సిద్దిపేట పట్టణంలో బుధవారం వాహనాలు నడుపుతున్న 20 మంది మైనర్లను సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పాత బస్టాండ్‌లో ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాయంత్రం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా బైక్‌లు నడుపుతూ పట్టుబడిన 20 మంది మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి వారితో మాట్లాడారు. మైనర్లకు ఎట్టి పరిస్థితిలోనూ బైక్‌లు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు అవసరం ఉన్నా, లేకున్నా వాహనాలు ఇస్తున్న కుటుంబ సభ్యులు, వారి ప్రాణాల విలువను గుర్తించడం లేదని అన్నారు. వారి సరదాలకంటే ప్రాణం విలువను గుర్తించినప్పుడే చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చన్నారు. మొదటి సారి పట్టుబడడంతో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. రెండవ సారి పట్టుబడితే బైక్ నడిపిన మైనర్లతో సహా వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై ఎంవీ యాక్టు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు, ఏఎస్సై, కానిస్టేబుల్స్ ఉన్నారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
చౌటుప్పల్ (మునుగోడు) : వాళ్లంతా విద్యార్థులు. చదువుకోవాల్సిన వారు జల్సాలకు అలవాటుపడ్డారు. విందులు, వినోదాల పేరిట బలాదూర్ తిరుగుతున్నారు. కల్లు, మద్యం సేవించడం అలవాటు చేసుకున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీరు డబ్బు కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే భారీ దొంగతనానికి పాల్పడ్డారు. కానీ చోరీ జరిగిన దుకాణంలో ఉన్న సీసీకెమెరాలకు చిక్కడంతో వీరి భాగోతం బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామోజు రమేష్ వెల్లడించారు. సంస్థాన్‌నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామానికి చెందిన మేకల రామకృష్ణ(17), మేకల ప్రశాంత్(15), కొప్పు వినోద్(15)లు చదువుకుంటున్నారు. రామకృష్ణ నారాయణపురంలో ఇంటర్ చదువుతుండగా మిగతా ఇద్దరు నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ హైస్కూల్లో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. కొంతకాలంగా వీరు ముగ్గురు జల్సాలకు అలవాటు పడ్డారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సులువైన మార్గం దొంగతనమేనని భావించారు. ముందస్తుగా రెక్కీ.. దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్న ఈ ముగ్గురు అనువైన ప్రాంతాల కోసం అన్వేషించారు. తరచుగా సినిమాలు చూసేందుకు చౌటుప్పల్‌కు వచ్చే వీరు ఇక్కడే దొంగతనం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 29న అనుకూలమైన దుకాణాల కోసం అన్వేషణ చేశారు. చిన్నకొండూరు చౌరస్తా వద్ద ఉన్న ఎంఎం మొబైల్ దుకాణాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా దుకాణంలోకి రెండుసార్లు వెళ్లి పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించారు. రాత్రి తొమ్మిదిన్నరకు దుకాణం బంద్ కాగానే వెనక భాగం నుంచి పై అంతస్తు మీదుగా లోనికి ప్రవేశించారు. దుకాణంలోని విలువైన 20సెల్ఫోన్లు, 35వేల నగదు, ల్యాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లారు. దొంగలను పట్టించిన సీసీకెమెరాలు మొబైల్ షాపులో దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల చిత్రాలు అక్కడి సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. కెమెరాలు ఉన్న విషయాన్ని అలస్యంగా గుర్తించిన సదరు దొంగలు గుర్తుపట్టకుండా ఉండేందుకు వేశాలు మార్చారు. కానీ అప్పటికే రికార్డయిన వీరి చిత్రాలు పోలీసులకు పెద్ద ఆధారంగా లభించాయి. సీసీఫూటేజీలను వివిధ స్టేషన్లకు పంపించి ఎంక్వైరీ చేసిన పోలీసులకు వీరి వివరాలు లభించాయి. చోరీసొత్తుతో విందులు, వినోదాలు సెల్‌ఫోను షాపులో ఎత్తుకెళ్లిన నగదుతో ఈ ముగ్గురు విందులు, వినోదాలు చేసుకున్నారు. సహచర మిత్రులను పిలిచి పార్టీలు ఇచ్చారు. 35వేలల్లో 15వేలను ఖర్చు చేశారు. వాహన తనిఖీల్లో .. మండలంలోని దామెర గ్రామం వద్ద మంగళవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు ముగ్గురు బైక్‌పై చౌటుప్పల్ వైపు వస్తున్నారు. పోలీసులను చూడగానే బయపడి పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద 2లక్షల రూపాయల విలువైన 20 సెల్ఫోన్లు, 20వేల నగదు, ఒక ల్యాప్‌టాప్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లను అమ్మేందుకు వీలు కాకపోవడంతో చిల్లాపురం గ్రామంలోని తమ బావి వద్ద ఉన్న గుట్టలో ఇంత కాలం దాచిపెట్టారు.ఎలాగైన అమ్మాలని తీసుకువస్తున్న క్రమంలో పట్టుబడ్డారు. వీరు మైనర్లు కావడంతో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం నల్లగొండలోని బాల నేరస్తుల న్యాయస్థానానికి తరలించారు. సమావేశంలో సీఐ ఏ.వెంకటయ్య, ఎస్సైలు చిల్లా సాయిలు, నవీన్‌బాబు, సిబ్బంది ఉన్నారు. -
కారుతో మైనర్ల బీభత్సం..
-
కారుతో మైనర్ల బీభత్సం..
హైదరాబాద్: రాజేంద్రనగర్ రోడ్లపై మైనర్లు ర్యాష్ డ్రైవింగ్‌తో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందడంతో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి కారుతో రొడ్డెక్కారు. తమ ఇష్టం వచ్చినట్లు కారు నడపడంతో వాహనంలో ఇళ్లల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మైనర్లు వెళ్తున్న కారును వెంబడించి పట్టుకున్నారు. ఓ అబ్బాయి సహా ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.