తిరుపతి లడ్డులో ఇనుప ముక్క
భక్తులు అత్యంత ప్రీతి పాత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులో శనివారం ఇనుప ముక్క కనిపించింది. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్కు చెందని ఓ భక్తుడు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లాడు. దేవుని దర్శనం అనంతరం లడ్డు కొనుగోలు చేశాడు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నాడు.
దేవుని ప్రసాదాన్ని బంధువులకు పంచే క్రమంలో లడ్డులో ఇనుప ముక్కను గుర్తించాడు. దాంతో శ్రీవారి ప్రసాదం తయారీలో టీటీడీ నిర్లక్ష్యం పట్ల భక్తుడు ఆగ్రహాం వ్యక్తం చేశాడు. లడ్డులోని ఇనుపముక్క ఉన్న విషయాన్ని మీడియాకి తెలియజేశాడు.