lord sri venkateswara swamy
-
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీనివాసుని వైభోగం చూద్దాం రారండి!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 04, శుక్రవారం వైభవంగా ఆరంభమయ్యాయి. ఇవి 12వ తేదీ, శనివారం వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా... బంగారు తిరుచ్చి ఉత్సవం: అక్టోబర్ 4, శుక్రవారం ఉదయం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.సాయంత్రం ధ్వజారోహణం: సాయంత్రం 5.45కు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రాంరంభమయ్యాయి. 7 – సోమవారం ఉదయం: కల్పవృక్ష వాహనం: నాలుగోరోజు ఉదయం స్వామి ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి దర్శనమిస్తారు. కల్పవృక్ష వాహన దర్శనం వరాలను అనుగ్రహిస్తుంది.రాత్రి: సర్వభూపాల వాహనం... సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. దిక్పాలకులందరూ స్వామివారిని హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఇస్తున్నారు.8 – మంగళవారం ఉదయం మోహినీ అవతారం: ఐదోరోజు ఉదయం మోహినీరూపంలో దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. తనకు భక్తులైనవారు మాయను సులభం గా దాటగలరని స్వామి ప్రకటిస్తున్నాడు.సాయంత్రం గరుడ వాహనం: ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయి.9 – బుధవారం ఉదయ: హనుమంత వాహనం: ఆరోరోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఇరువురినీ చూస్తే వేదాల తత్త్వం ఒనగూరుతుంది.సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం: ఆరోరోజు సాయంత్రం స్వామి స్వర్ణరథాన్ని అధిరోహించి అనుగ్రహిస్తాడు. స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయం. రాత్రి 7 గంటలకు గజవాహనం... ఆరోరోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు అభయ మిస్తాడు. భక్తులు శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని తెలుస్తోంది.10 – గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం: ఏడోరోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యప్రభ వాహనంపైన దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం సిద్ధిస్తాయి.రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం: ఏడో రోజు రాత్రి స్వామి చంద్రప్రభ వాహనం పై విహరిస్తారు. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.11 – శుక్రవారం ఉదయం: శ్రీవారి రథోత్సవం: ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన స్వామి రథోత్సవం జరుగుతుంది.రాత్రి 7 గంటలకు అశ్వవాహనం: ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూ΄ాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని ప్రబోధిస్తున్నాడు.12 – శనివారం ఉదయం 6 గంటలకు చక్రస్నానం: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుగుతుంది. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు ΄ాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో పుష్కరిణిలో స్నానం చేసిన వారు యజ్ఞఫలాన్ని పొందుతారని ప్రతీతి..రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.– లక్ష్మీకాంత్ ఆలిదేనా, సాక్షి, తిరుమల -
'ఎల్లో మీడియాది నీచ సంస్కృతి'
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని వివాదం చేయడం ఎల్లో మీడియా నీచ సంస్కృతికి నిదర్శనమని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం భూమన తిరుమలలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును సీఎంగా కూర్చోబట్టడానికి ఎల్లో మీడియా తహతహలాడుతుందని ఆయన ఎద్దెవా చేశారు. అందులోభాగంగానే జగన్‌పై బురద జల్లడాన్ని ఎల్లో మీడియా కంకణం కట్టుకుందని ఆరోపించారు. గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవారికి చాలా సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మహానేత తనయుడిగా జగన్‌కు వారసత్వం రాదా అని ఆయన ఎల్లో మీడియాను ప్రశ్నించారు. శ్రీవారి దర్శనం చేసుకున్న జగన్ అంశాన్ని వివాదస్పదం చేసి ఎల్లో మీడియా పాపం మూట కట్టుకుందన్నారు. ఆ పాపం ఎల్లో మీడియాకు తగలక మానదన్నారు. వచ్చే ఐదేళ్లు సీఎంగా వైఎస్ జగన్ ప్రతి సంవత్సరం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని జోస్యం కురుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున విఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ బయలుదేరారు. -
తిరుపతి లడ్డులో ఇనుప ముక్క
-
తిరుపతి లడ్డులో ఇనుప ముక్క
భక్తులు అత్యంత ప్రీతి పాత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులో శనివారం ఇనుప ముక్క కనిపించింది. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందని ఓ భక్తుడు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లాడు. దేవుని దర్శనం అనంతరం లడ్డు కొనుగోలు చేశాడు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నాడు. దేవుని ప్రసాదాన్ని బంధువులకు పంచే క్రమంలో లడ్డులో ఇనుప ముక్కను గుర్తించాడు. దాంతో శ్రీవారి ప్రసాదం తయారీలో టీటీడీ నిర్లక్ష్యం పట్ల భక్తుడు ఆగ్రహాం వ్యక్తం చేశాడు. లడ్డులోని ఇనుపముక్క ఉన్న విషయాన్ని మీడియాకి తెలియజేశాడు. -
తిరుమలలో విరిగిన శ్రీవారి పాదం బోటన వేలు
-
తిరుమలలో విరిగిన శ్రీవారి పాదం బోటన వేలు
తిరుమలలో ఆదివారం దుస్సంఘటన చోటు చేసుకుంది. శ్రీవారి మెట్టు మీదున్న ఉన్న శ్రీవారి పాదాల్లోని ఎడమ పాదం బోటన వేలు విరిగి పోడిపోయింది. ఆ విషయం గమనించిన భక్తులు వెంటనే శ్రీవారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా శ్రీవారి పాదాల బోటనవేలు విరిగిపోవడంపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పటికే అధ్వానంగా ఉన్నాయి. అంతేకాకుండా శ్రీవారి పాదల బోటన వేలు విరగడం ఏదో ఓ ఉపద్రవం జరిగే సూచనలు ఉన్నాయని భక్తులు భయపడుతున్నారు. అయితే శ్రీవారి పాదాల బోటన వేలు విరిగిన టీటీడీ అధికారులు అసలు ఆ వైపే రాకపోవడంపై భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. -
2 గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం
సీమాంధ్రలో సమైక్య సెగలు నిప్పులు కక్కుతున్నాయి. ఆ సెగలు పరంపర కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు వెంచేసియున్న తిరుమలను తాకాయి. దాంతో నిత్యం భక్త జన సంధ్రంతో కిటకిటలాడే తిరుమల మంగళవారం వెలవెలబోయింది. తిరుమలలోని తిరుమాడ వీధులు జనం లేక బోసిపోయాయి. కంపార్ట్మెంట్లు అన్ని దాదాపు నిర్మానుష్యంగా మారాయి. భక్తులు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం 20 గంటలు పడుతుంది. అయితే సీమాంధ్ర ఉద్యమం పుణ్యమా అని భక్తులు 2 గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. అలాగే తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట వద్ద భక్తులు బారులు తీరుతుంటారు. అక్కడ కూడా భక్తుల రద్దీ చాలా తక్కవగా ఉంటుంది. దీంతో తిరుపతి నుంచి కాలినడక కొండపైకి వచ్చే భక్తులు మొక్కులు, దేవుని దర్శనం చేసుకుని సాయంత్రానికి కాలినడకన తిరుపతికి బయలుదేరుతున్నారు. గతంలో విఐపీ సిపార్సు లేఖతో వెళ్లిన శ్రీవారి దర్శనం ఐదారుగంటలు సమయం పట్టేది. సమైక్యాంధ్ర సెగతో నేడు వెంకన్న దర్శనం రెండుగంటల్లో పూర్తి కావడంతో భక్తులు ఆనంద పరవశులవుతున్నారు. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా ఉండేందుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో టీటీడీ ఈఓ ఎం.జీ.గోపాల్, చిత్తూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే సమ్మెను విరమించుకుని ఆర్టీస్ బస్సులను తిరుమల కొండపైకి నడపాలని అర్టీసీ ఎండీ ఏ.కే.ఖాన్ మంగళవారం అర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆ విషయంపై కార్మికులతో చర్చలు జరపాలని అర్టీసీ ఎండీ తిరుపతి డిఎంను ఆదేశించారు. ఈ రోజు సాయంత్రం కార్మికులు, డిఎం మధ్య చర్చలు జరగనున్నాయి. 38 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కొండ పైకి ఆర్టీసీ బస్సులు వెళ్లడం ఆగిపోయింది.