రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు | PM Narendra Modi hosts farewell dinner for outgoing President Ram Nath Kovind | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు

Published Sat, Jul 23 2022 5:23 AM | Last Updated on Sat, Jul 23 2022 11:05 AM

PM Narendra Modi hosts farewell dinner for outgoing President Ram Nath Kovind - Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులకు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వీడ్కోలు విందు ఇచ్చారు.  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముతోపాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీత మొగిలయ్య, గిరిజన నేతలు పాల్గొన్నారు.

హోటల్‌ అశోకాలో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ రంజన్‌ చౌధురితోపాటు 18 పార్టీల నేతలు కూడా ఉన్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం సోమవారంతో ముగియనుంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement