రాజీవ్‌ ఖేల్‌రత్న అందుకున్న కోహ్లి | Virat Kohli Receives Rajiv Gandhi Khel Ratna Award From President Ram Nath Kovind | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 25 2018 5:32 PM | Last Updated on Tue, Sep 25 2018 6:14 PM

 Virat Kohli Recieves Rajiv Gandhi Khel Ratna Award From President Ram Nath Kovind - Sakshi

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తున్న కోహ్లి

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులు మీదుగా ప్రతిష్టాత్మక రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అవార్డులు వరించాయి. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను సైతం అవార్డు స్వీకరించారు.

జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాతో పాటు మరో 20 మంది క్రీడాకారులు అర్జున అవార్డును అందుకున్నారు. ఖేల్‌ రత్న పురస్కారం పొందిన వారికి పతకం, ప్రశంసా పత్రంతోపాటు రూ. 7 లక్షల 50 వేలు... ‘అర్జున’ అవార్డీలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షల నగదు పురస్కారం అందజేశారు. వాస్తవానికి జాతీయ క్రీడల దినోత్సవం (ఆగస్టు 29) రోజునే ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగాలి. కానీ ఏషియన్‌ గేమ్స్‌ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నేడు (సెప్టెంబర్‌ 25) నిర్వహించారు. ఈ రోజే  ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డులను కూడా అందజేశారు.

అర్జున అవార్డు గ్రహితలు: నేలకుర్తి సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్‌), హిమ దాస్‌ (అథ్లెటిక్స్‌), స్మృతి మంధాన (క్రికెట్‌), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నోబాత్‌ (షూటింగ్‌), శ్రేయసి సింగ్‌ (షూటింగ్‌), మనిక బాత్రా (టేబుల్‌ టెన్నిస్‌), పూజా కడియాన్‌ (వుషు), నీరజ్‌ చోప్రా (అథ్లెటిక్స్‌), రోహన్‌ బోపన్న (టెన్నిస్‌), జి. సత్యన్‌ (టేబుల్‌ టెన్నిస్‌), జిన్సన్‌ జాన్సన్‌ (అథ్లెటిక్స్‌), సతీశ్‌ కుమార్‌ (బాక్సింగ్‌), మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ), అంకుర్‌ మిట్టల్‌ (షూటింగ్‌), సుమీత్‌ (రెజ్లింగ్‌), రవి రాథోడ్‌ (పోలో), శుభాంకర్‌ శర్మ (గోల్ఫ్‌), అంకుర్‌ ధామ (పారాథ్లెటిక్స్‌), మనోజ్‌ సర్కార్‌ (పారా బ్యాడ్మింటన్‌). 

ద్రోణాచార్య అవార్డు గ్రహితలు:  (రెగ్యులర్‌): ఎస్‌.ఎస్‌.పన్ను (అథ్లెటిక్స్‌), సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్‌), విజయ్‌ శర్మ (వెయిట్‌ లిఫ్టింగ్‌), ఎ. శ్రీనివాసరావు (టేబుల్‌ టెన్నిస్‌). 
లైఫ్‌టైమ్‌ విభాగం: క్లారెన్స్‌ లోబో (హాకీ), తారక్‌ సిన్హా (క్రికెట్‌), జీవన్‌ కుమార్‌ శర్మ (జూడో), వి.ఆర్‌.బీడు (అథ్లెటిక్స్‌). 

ధ్యాన్‌చంద్‌ అవార్డు అందుకున్నవారు: సత్యదేవ్‌ ప్రసాద్‌ (ఆర్చరీ), భరత్‌ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్‌ (అథ్లెటిక్స్‌), దత్తాత్రేయ దాదూ చౌగ్లే (రెజ్లింగ్‌).   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement