
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో ఈ పర్యటన ఉండబోతోంది. బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. నిరుడు కోవిడ్ కారణంగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి రాలేదు. ఈ సారి రాష్ట్రపతి దక్షిణాది విడిదికి వస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతిభవన్ వర్గాలు సమాచారం అందించారు. ఈ విడిదిలో భాగంగా నాలుగైదు రోజులపాటు ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment